Kaushal Manda : అమ్మాయిలను పంపిస్తాడు అని నా గురించి బ్యాడ్ గా.. అందుకే అంత సంపాదన ఉన్నా వదిలేసా..

తాజాగా కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

Kaushal Manda : అమ్మాయిలను పంపిస్తాడు అని నా గురించి బ్యాడ్ గా.. అందుకే అంత సంపాదన ఉన్నా వదిలేసా..

Bigg Boss Fame Actor Kaushal Manda

Updated On : June 29, 2025 / 7:55 PM IST

Kaushal Manda : దాదాపు 20 ఏళ్లకు పైగా మోడలింగ్, సినిమా రంగంలో ఉన్నాడు కౌశల్. ఓ పక్కన మోడలింగ్, మోడలింగ్ ఈవెంట్స్ చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 2 లో విన్నర్ గా నిలిచి బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇటీవల కన్నప్ప సినిమాలో మంచు విష్ణు ఫ్రెండ్ పాత్రలో కనిపించి మెప్పించాడు.

అయితే కౌశల్ కెరీర్ మొదట్లో మోడలింగ్ తో పాటు మోడలింగ్ ఏజెన్సీ నడిపిస్తూ క్యాస్టింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేసాడు. మహేష్, పవన్, రాజమౌళి, ఎన్టీఆర్, రాఘవేంద్రరావు, పూరి జగన్నాద్.. ఇలా చాలా మంది స్టార్స్ సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్ గా పనిచేసి అనేకమంది మోడల్స్ ని సినీ పరిశ్రమకు తీసుకొచ్చాడు. హైదరాబాద్ లో ఫస్ట్ మోడలింగ్, క్యాస్టింగ్ ఏజెన్సీ కూడా కౌశల్‌దే. కానీ మోడలింగ్ చేసినా క్యాస్టింగ్ డైరెక్టర్, సినిమాలకు మోడల్స్ ని పంపడం మాత్రం మానేసాడు.

Also Read : Pawan Kalyan – Kaushal Manda : నేను హీరోగా ‘పవన్ కళ్యాణ్’ బయోపిక్.. కానీ.. టైటిల్ ఏంటంటే..?

తాజాగా కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కౌశల్ తాను క్యాస్టింగ్ డైరెక్టర్ వర్క్ ఎందుకు వదిలేసాడో తెలిపాడు.

కౌశల్ మాట్లాడుతూ.. మోడలింగ్ ఏజెన్సీలో బాగా డబ్బులు వచ్చేవి. అప్పట్లో హైదరాబాద్ లో ఎవరూ లేరు. నేనే సినిమాల్లో మోడల్స్ ని తెచ్చేవాడ్ని. మనం వర్క్ మీద పంపించి నలుగురికి పని ఇప్పిస్తున్నా మన గురించి తప్పుగానే అనుకుంటారు. అలా అమ్మాయిలను పంపిస్తాడు అని నా గురించి బ్యాడ్ గా మాట్లాడేవాళ్ళు. దాంతో క్యాస్టింగ్ డైరెక్టర్ మానేసి యాక్టర్ గా మారిపోయాను. జస్ట్ మోడలింగ్, మోడలింగ్ ఈవెంట్స్ చేశాను కానీ మూవీస్ కి క్యాస్టింగ్ చేయలేదు మళ్ళీ. పెళ్లి అయ్యాక నా భార్య కూడా మళ్ళీ క్యాస్టింగ్ డైరెక్టర్ గా చేయొద్దు అని చెప్పింది. నేను అది చేసి ఉంటే హైదరాబాద్ లో పెద్ద క్యాస్టింగ్ కంపెనీగా, ఇంకా పెద్దగా సెటిల్ అయి ఉండేవాడిని. జనాలు అలా అనడం నాకు నచ్చలేదు. అందుకే వదిలేసా. రాఘవేంద్ర గారు పిలిచి నువ్వు ఇది వదలకు అని ఎంకరేజ్ చేసారు, నీ వల్ల చాలా సినిమాలకు హెల్ప్ అవుతుంది అన్నారు కానీ నేను వదిలేసాను. నా దగ్గర పనిచేసిన అసిస్టెంట్స్ కి నా దగ్గర ఉన్న ప్రొఫైల్స్ అన్ని ఇచ్చేసి వాళ్ళని చేసుకోమన్నాను అని తెలిపారు.

Also Read : Rajamouli : రాజమౌళి ఫస్ట్ హీరో ఎన్టీఆర్ కాదు.. మరి ఎవరో తెలుసా?