Pawan Kalyan – Kaushal Manda : నేను హీరోగా ‘పవన్ కళ్యాణ్’ బయోపిక్.. కానీ.. టైటిల్ ఏంటంటే..?
కౌశల్ పవన్ కళ్యాణ్ బయోపిక్ తీయాలని ప్లాన్ చేసినట్టు తెలిపాడు.

Bigg Boss Fame Kaushal Manda Plans Pawan Kalyan Biopic
Pawan Kalyan – Kaushal Manda : బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న కౌశల్ మండా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ, మోడలింగ్, మోడలింగ్ ఏజెన్సీలు నడుపుతూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కన్నప్ప సినిమాలో విష్ణు ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ఈ క్రమంలో కౌశల్ పవన్ కళ్యాణ్ బయోపిక్ తీయాలని ప్లాన్ చేసినట్టు తెలిపాడు.
Also Read : Hero : 22 ఏళ్ళుగా సినీ పరిశ్రమలో హీరో.. కానీ ఇన్నాళ్లు సొంత ఇల్లు లేదట.. ఒక్క ఆస్తి కూడా కొనలేదట..
కౌశల్ మాట్లాడుతూ.. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్. పవన్ కళ్యాణ్ బయోపిక్ నేను హీరోగా ప్లాన్ చేసారు. ‘సేనాని’ అనే టైటిల్ తో సినిమా మొదలుపెట్టాము. 2019 ఎన్నికలకు ముందు సినిమా అనుకున్నాము. ఎన్నికల లోపే సినిమా చేసి రిలీజ్ చేయాలి అనుకున్నాం. కానీ ఆ నిర్మాత బాగా ఆలస్యం చేసారు. నిర్మాత వల్ల, అనుకోని కారణాలతో మేమే సినిమాని ఆపేశాం. ఆరు నెలలు ఆ సినిమాకు సమయం వేస్ట్ చేసాం అని తెలిపారు. మరి భవిష్యత్తులో పవన్ బయోపిక్ కౌశల్ తీస్తారేమో చూడాలి.