Hero : 22 ఏళ్ళుగా సినీ పరిశ్రమలో హీరో.. కానీ ఇన్నాళ్లు సొంత ఇల్లు లేదట.. ఒక్క ఆస్తి కూడా కొనలేదట..
22 ఏళ్ళు నటుడిగా ఉన్నా, 25 ఏళ్ళు సినీ పరిశ్రమలో ఉన్నా ఇన్నాళ్లు సొంతిల్లు లేదట, ఇటీవలే కొన్ని నెలల క్రితమే ఇల్లు కొన్నాడట.

Telugu and Tamil Hero Siddharth comments on his Own House
Hero : సినీ పరిశ్రమలో ఒక్కసారి ఫేమ్ వస్తే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఆస్తులు కొంటారు, బిజినెస్ లలో పెట్టుబడులు పెడతారు. కానీ ఈ హీరో మాత్రం 22 ఏళ్ళు నటుడిగా ఉన్నా, 25 ఏళ్ళు సినీ పరిశ్రమలో ఉన్నా ఇన్నాళ్లు సొంతిల్లు లేదట, ఇటీవలే కొన్ని నెలల క్రితమే ఇల్లు కొన్నాడట.
ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు సిద్దార్థ్. తమిళ్, తెలుగులో అనేక సినిమాలతో హిట్స్ కొట్టి ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఎదిగి ప్రేక్షకులను మెప్పించిన సిద్దార్థ్ ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. సిద్దార్థ్ నటించిన 3BHK సినిమా జులై 4 రిలీజ్ కానుంది. ఈ సినిమా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సొంతింటి కల అనే కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో సిద్దార్థ్ తన సొంతింటి గురించి మాట్లాడారు.
Also Read : Anasuya Bharadwaj : సండే రోజు సరదాగా.. ఫ్యామిలీతో చిల్ అవుతున్న అనసూయ..
సిద్దార్థ్ మాట్లాడుతూ.. నేను సినీ పరిశ్రమకు వచ్చి ఆల్మోస్ట్ 25 ఏళ్ళు అయింది. నా సగం పైగా జీవితం సినిమాల్లోనే గడిపాను. కానీ నేను ఇప్పటివరకు ఒక్క ప్రాపర్టీ కూడా కొనుక్కోలేదు. నాకు సొంత ఇల్లు, ల్యాండ్ లాంటిది ఏమి లేదు. ఇప్పుడు నాకు పెళ్లి అయి బాధ్యతలు పెరిగాయి అందుకే రెండు నెలల క్రితమే సొంతిల్లు కొనుక్కున్నాను. అది నాకు, అదితికి కామన్ గా ఉన్న డ్రీం హౌస్. మా ఇద్దరికి ఒక ఇల్లు ఉండాలని ఆశపడి కొనుక్కున్నాం. పెళ్లి ఎప్పుడు చేసుకుంటాను, ఇల్లు ఎప్పుడు కొంటాను అని మా పేరెంట్స్ ఎదురుచూసేవారు. వాళ్ళ కోరికలు తీరాయి అని తెలిపాడు.
సిద్దార్థ్ కొన్ని నెలల క్రితం హీరోయిన్ అదితి రావు హైదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఇప్పుడు సొంతిల్లు కూడా కొన్నాను అని చెప్పాడు. ఇన్నేళ్ల నుంచి సినీ పరిశ్రమలో హీరోగా ఉండి సంపాదించినా సొంత ఇల్లు, ప్రాపర్టీ ఏం లేదా అని ఆశ్చర్యపోతున్నారు అంతా.
Also Read : Raghava Lawrence : ‘నేను పారిపోయాను.. ఆయన కొడతాడు..’ స్పందించిన రాఘవ లారెన్స్..