Rajamouli : రాజమౌళి ఫస్ట్ హీరో ఎన్టీఆర్ కాదు.. మరి ఎవరో తెలుసా?
తాజాగా ఓ నటుడు రాజమౌళి మొదటి హీరో నేనే అని చెప్పుకొచ్చాడు.

Do You Know Rajamouli First Hero its not NTR
Rajamouli : రాజమౌళి బాహుబలి తో పాన్ ఇండియా స్థాయికి, RRR సినిమాతో పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు తో భారీ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ చాలామంది రాజమౌళి సినిమా అని ఎదురుచూస్తున్నారు. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 అని, ఆ సినిమా హీరో ఎన్టీఆర్ అని అందరికి తెలిసిందే.
తాజాగా ఓ నటుడు రాజమౌళి మొదటి హీరో నేనే అని చెప్పుకొచ్చాడు. అయితే రాజమౌళి సినిమాల కంటే ముందు సీరియల్, యాడ్స్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలా ఆ నటుడు రాజమౌళి మొదటి హీరో నేనే అని చెప్పాడు.
Also Read : Pawan Kalyan – Kaushal Manda : నేను హీరోగా ‘పవన్ కళ్యాణ్’ బయోపిక్.. కానీ.. టైటిల్ ఏంటంటే..?
ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా కౌశల్ మండా. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి, నటుడిగా మారి బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచి ఫేమ్ తెచ్చుకున్నాడు కౌశల్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కౌశల్ మాట్లాడుతూ.. రాజమౌళి ఫస్ట్ హీరో నేనే. రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన మొదటి యాడ్ గవర్నమెంట్ కి సంబంధించి వాటర్ యాడ్. రాఘవేంద్రరావు గారు రాజమౌళికి ఆ యాడ్ ఇచ్చారు. నన్ను కూడా రాఘవేంద్రరావు గారే సజెస్ట్ చేసారు. అందులో నేనే మెయిన్ లీడ్ నటించాను. రాజమౌళి గారు ఫస్ట్ యాక్షన్, కట్ చెప్పింది నాకే. అలా రాజమౌళి మొదటి హీరోని నేనే. రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు నేనే క్యాస్టింగ్ డైరెక్టర్ గా పనిచేసాను అని తెలిపారు.
Also Read : Hero : 22 ఏళ్ళుగా సినీ పరిశ్రమలో హీరో.. కానీ ఇన్నాళ్లు సొంత ఇల్లు లేదట.. ఒక్క ఆస్తి కూడా కొనలేదట..