Dilip Kumar: లెజెండ్ దిలీప్ కుమార్ కన్నుమూత

బాలీవుడ్ లెజెంట్ దిలీప్ కుమార్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ముంబైలోని హిందూజ హాస్పిటల్ లో 98సంవత్సరాల వయస్సులో తుదిశ్వాస విడిచారు.

Dilip Kumar: బాలీవుడ్ లెజెండ్.. ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ముంబైలోని హిందూజ హాస్పిటల్ లో 98సంవత్సరాల వయస్సులో తుదిశ్వాస విడిచారు. వారం క్రితం బుధవారం ఊపిరితిత్తుల సమస్యతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఇదే సమస్యతో హాస్పిటల్ లో చేరడం రెండో సారి.

జూన్ 6న శ్వాస అందకపోవడంతో హాస్పిటల్ లో చేరిన ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్ అందిండచంతో ఆరోగ్య కుదుటపడింది. అప్పటికే చనిపోయినట్లుగా వార్తలు ప్రచారం అవడంతో శరద్ పవార్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ట్విట్టర్ ద్వారా అప్ డేట్ చేసిన ఆయన.. వాట్సప్ ఫార్వార్డ్ మెసేజ్ లను నమ్మశక్యం అనిపించలేదు. అందుకే వెళ్లి కలిశాను. ఆయన స్థిమితంగానే ఉన్నారు. మీ ప్రార్థనలకు థ్యాంక్యూ. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఆయన ఇంటికి చేరుకోవడానికి మరో రెండుమూడు రోజుల సమయం పడుతుంది అని చెప్పారు.

కొద్ది సంవత్సరాలం క్రితం నుంచి కిడ్నీ సమస్యతో పాటు న్యూమోనియాతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఈ డిసెంబర్ తో 99వ బర్త్ డే జరుపుకోవాల్సిన దిలీప్ కనుమూసే సమయానికి భార్య సైరా భాను అక్కడే ఉన్నారు. ఊపిరితిత్తులలోకి ఎక్కువ నీరు చేరడంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది.

ఆరు దశాబ్దాలుగా సినిమా రంగానికి సేవలు అందించిన ఆయన దేవదాస్ (1955), నయా దౌర్(1957), మొఘల్ ఏ అజామ్ (1960), గంగా జమునా (1961), క్రాంతి (1981), కర్మా (1986) లాంటి హిట్ సినిమాల్లో నటించారు. ఆయన చివరిగా ఖిలా (1998) సినిమాకు పనిచేశారు.

ట్రెండింగ్ వార్తలు