×
Ad

Dimple Hayathi : రష్మిక, నిధి అగర్వాల్‌ని ఫాలో అవుతున్న డింపుల్.. ఏ విషయంలో తెలుసా..?

ఇటీవల పోలీస్ కేసు అండ్ కోర్టు అంటూ మీడియాలో హాట్ టాపిక్ అయిన డింపుల్ హయతి.. ఒక విషయంలో రష్మిక, నిధి అగర్వాల్‌ని ఫాలో అవుతుంది. అదేంటంటే..

  • Published On : June 25, 2023 / 07:32 PM IST

Dimple Hayathi follows Rashmika Mandanna Nidhhi Agerwal

Dimple Hayathi : టాలీవుడ్ యాక్ట్రెస్ డింపుల్ హయతి.. గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీంతో తెలుగు తమిళ స్టార్ హీరోలు విశాల్, రవితేజ సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. అయితే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల గోపీచంద్ సరసన ‘రామబాణం’ సినిమాలో కూడా నటించిన సక్సెస్ వరించలేదు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ విజయాలు లేకపోవడంతో ఆఫర్లు చేరి రావడం లేదు.

Arjun Sarja : స్టార్ కమెడియన్ కొడుకుతో హీరో అర్జున్‌ కూతురు పెళ్లి..? ఆ వరుడు ఎవరో తెలుసా..!

ఇక ఇటీవల ఒక పోలీస్ కేసులో చిక్కుకొని టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. పోలీస్ స్టేషన్, కోర్టు అంటూ కొన్నిరోజులు నుంచి మీడియాలో నిలుస్తూ వస్తుంది. దీంతో ఈ అమ్మడి కెరీర్ బ్యాడ్ టైంలో నడుస్తుందని అందరూ కామెంట్స్ చేశారు. మరి డింపుల్ కూడా అదే ఫీల్ అయ్యినట్లు ఉంది. ఇక వీటన్నిటి నుంచి బయట పడేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. ఈమధ్య కాలంలో టాలీవుడ్ లోని స్టార్స్ జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణుస్వామి.. దింపులే ఇంటిలో ప్రత్యేక పూజలు, యాగాలు చేశారు.

Prabhas – Ram Charan : ప్రభాస్, చరణ్ సినిమాల గురించి లోకేష్ కనగరాజ్ ఇంటరెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే!

గతంలో టాలీవుడ్ హీరోయిన్లు రష్మిక మందన్న (Rashmika Mandanna), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal).. తమ కెరీర్స్ లో ఇబ్బంది పడుతున్న సమయంలో వేణుస్వామి దగ్గర పూజలు చేయించుకున్నారు. ఆ తరువాత వాళ్ళకి ఆఫర్లు వచ్చి కెరీర్ పుంజుకుంది అంటుంటారు. ఇప్పుడు వారిని ఫాలో అవుతూ డింపుల్ హయతి కూడా వేణుస్వామి పై భారం వేసింది. ప్రస్తుతం ఈ పూజలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే, ఈ భామ కమల్ హాసన్ ఇండియన్ 2 లో ఒక స్పెషల్ సాంగ్ చేసే అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అవి ఎంతవరకు నిజమో తెలియదు.