Dimple Hayathi Reply To Fan Over Temple Creates Buzz
Dimple Hayathi: మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’ మే 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీవాస్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్ గ్యారెంటీ హిట్ అందుకుంటారని అందరూ ఆశిస్తున్నారు.
Dimple Hayathi : రామబాణం ప్రమోషన్స్‌లో పంజాబీలో పలకరించిన డింపుల్ హయతి..
కాగా, ఈ సినిమాలో అందాల భామ డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తోండగా.. గోపీచంద్‌తో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్, ట్రైలర్స్‌లో ఈ జోడీ చూడచక్కగా ఉందంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీమర్స్‌తో గోపీచంద్, డింపుల్ ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని డింపుల్‌ను ఓ ప్రశ్న అడిగాడు. దానికి డింపుల్ కూడా మైండ్‌బ్లాక్ అయ్యే రేంజ్‌లో యాన్సర్ ఇచ్చింది.
Dimple Hayathi: సింపుల్ లుక్‌లో అదరగొట్టిన డింపుల్ హయతి
డింపుల్ కోసం తాను ఓ గుడి కట్టించాలని అనుకుంటున్నానని.. అది పాలరాయితో కట్టించాలా లేక ఇటుకరాయితో కట్టించాలా అని ఓ అభిమాని అడిగాడు. దీనికి రిప్లై ఇస్తూ డింపుల్ తనకు బంగారంతో గుడి కడితే సంతోషిస్తానంది. దీంతో డింపుల్ చేసిన కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.