Dhurandhar 2: దురంధర్ 2 క్లైమాక్స్ లో భారీ ట్విస్ట్.. ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
దురంధర్ 2(Dhurandhar 2) ముగింపులో ఆడియన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వనున్న దర్శకుడు ఆదిత్య ధర్.
- V Santhosh Kumar
- Published On : March 15, 2026 / 01:46 PM IST
Director Aditya Dhar planning to do sequel for Dhurandhar 2.
Dhurandhar 2: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్న యాక్షన్ విజువల్ వండర్ మూవీ ‘ధురంధర్ 2’. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించేందుకు సిద్ధమైంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రికార్డులను తిరగరాస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ చిత్రం ఏకంగా రూ. 2000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Malavika Mohanan: ఆరంజ్ కలర్ డ్రెస్సులో ఓ రేంజ్ గ్లామర్.. మాళవిక అందానికి నెటిజన్స్ ఫిదా.. ఫొటోలు
ఇప్పటికే విడుదలైన ట్రైలర్, గ్లింప్స్ సృష్టించిన ఇంపాక్ట్ సినిమాపై అంచనాలను భారీగా పనిచేసింది. అయితే, ఈ సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న ఒక వార్త సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘ధురంధర్ 2(Dhurandhar 2)’ ముగింపులో దర్శకుడు ఆదిత్య ధర్ ఒక భారీ క్లైమాక్స్ ట్విస్ట్ ప్లాన్ చేశారట. కేవలం ట్విస్ట్‌తోనే సరిపెట్టకుండా, సినిమా చివర్లో ‘ధురంధర్ 3’కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఉంటుందని సమాచారం. ఇది నిజంగా అభిమానులకు ఊహించని షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
రెండో భాగం ముగిసిన వెంటనే మూడో భాగం ఎప్పుడు మొదలవుతుంది? కథ ఎటు మలుపు తిరగబోతోంది? అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఈ సీక్వెల్ షూటింగ్ షెడ్యూల్, ఇతర వివరాలపై చిత్ర యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మార్చి 19న థియేటర్లలో ఈ థ్రిల్లింగ్ అనుభవాన్ని ఆస్వాదించేందుకు అభిమానులు కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.
