అవును.. వాళ్లిద్దరూ విడిపోయారు!

  • Published By: sekhar ,Published On : September 19, 2020 / 07:57 PM IST
అవును.. వాళ్లిద్దరూ విడిపోయారు!

Updated On : September 19, 2020 / 8:20 PM IST

Kalyani, Surya Kiran Divorced: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4లో రెండో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టాడు డైరెక్టర్, నటి కళ్యాణి భర్త సూర్యకిరణ్. తన బిహేవియర్ వల్ల ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయ్యారు. తాజాగా బిగ్‌బాస్ షో గురించి, తన పర్సనల్ విషయాల గురించి ఓ ఇంటర్వూలో మాట్లాడారు సూర్య కిరణ్.. ఈ సందర్భంగా తన భార్యతో విడిపోయిన మాట వాస్తవమేనని అన్నారు.


‘‘కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కళ్యాణి, నేను విడిపోయాం.. నా జీవితంలో తనకు తప్ప వేరొక మహిళకు స్థానం లేదు. ఆమె ఇప్పటికీ తిరిగి నా జీవితంలోకి వస్తానంటే సంతోషంగా స్వాగతిస్తా.. తనంటే చాలా ఇష్టం నాకు.. కళ్యాణి నన్ను వదిలివెళ్లడానికి తనకు పర్సనల్‌గా కొన్ని కారణాలున్నాయి.. నేను తన నిర్ణయాన్ని గౌరవిస్తాను’’ అని చెప్పారు సూర్య కిరణ్.


కాగా రాజశేఖర్ ‘శేషు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కళ్యాణి.. ‘జౌను.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు.., పందెం, పెదబాబు, కబడ్డీకబడ్డీ, దొంగోడు’ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. సూర్య కిరణ్ ‘సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్, చాప్టర్ 2’ సినిమాలకు దర్శకత్వం వహించారు.