Brahmaji : స్టార్ డైరెక్టర్ని కత్తితో బెదిరించిన నటుడు బ్రహ్మాజీ.. వీడియో వైరల్.. కొడుకు సినిమా కోసమే..!
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ(Brahmaji) స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ని బెదిరించాడు. అనిల్ మెడ పై కత్తి పెట్టి బ్రహ్మాజీ బెదిరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Thota Vamshi Kumar
- Updated on- July 23, 2023 / 04:57 PM IST
Brahmaji-Anil Ravipudi
Brahmaji-Anil Ravipudi : ప్రముఖ నటుడు బ్రహ్మాజీ(Brahmaji) స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ని బెదిరించాడు. అనిల్ మెడ పై కత్తి పెట్టి బ్రహ్మాజీ బెదిరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటీజన్లు మాత్రం తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Vijay Deverakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండను పరిగెత్తించిన అభిమాని.. ఏం చేశాడో తెలుసా..?
‘పిట్టకథ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావ్(Sanjay Rrao). దాదాపు మూడేళ్ల విరామం తరువాత ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రణవి మానుకొండ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Devara : దేవరకు తలనొప్పిగా మారిన ఫ్యాన్స్.. చిత్ర బృందం కీలక నిర్ణయం..!
కాగా.. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగానే బ్రహ్మాజీ, అనిల్ రావుపూడిలు సినిమా విడుదల తేదీని చెబుతూ ఓ చిన్న సరదా వీడియోను రూపొందించారు. ఆ వీడియోలో ఏం ఉందంటే..? ఓ సినిమా షూటింగ్లో అనిల్ రావిపూడి బిజీగా ఉంటాడు. అతడి వద్దకు నటుడు బ్రహ్మాజీ వెళతాడు. తన కొడుకు సినిమా విడుదల తేదీని ప్రేక్షకులకు చెప్పాలని కోరతాడు.
Bro Trailer : బ్రో ట్రైలర్ ఆగయా.. మామా అల్లుడు కుమ్మేసారుగా..
అయితే ఇందుకు అనిల్ రావిపూడి నిరాకరిస్తాడు. వెంటనే బ్రహ్మాజీ తన దగ్గర ఉన్న కత్తిని తీసుకుని అనిల్ మెడ దగ్గర పెట్టి బెదిరిస్తాడు. దీంతో అనిల్ రావిపూడి స్లమ్ డాగ్ హస్సెండ్ సినిమా జూలై 29న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పడంతో వీడియో పూర్తి అవుతుంది. కాగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు, ఇతర ప్రమోషన్స్‌కు అనిల్ రావిపూడి వచ్చిన సంగతి తెలిసిందే.
