Vijay Deverakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండను పరిగెత్తించిన అభిమాని.. ఏం చేశాడో తెలుసా..?
సినీ తారలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్లు కనిపించగానే కొన్ని సార్లు అభిమాలు చేసే పనులతో స్టార్స్ ఇబ్బంది పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

Vijay Deverakonda fan breaches security
Vijay Deverakonda fan breaches security : సినీ తారలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్లు కనిపించగానే కొన్ని సార్లు అభిమాలు చేసే పనులతో స్టార్స్ ఇబ్బంది పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తమ అభిమాన నటుడు స్టేజ్ మీద మాట్లాడుతుండగా ఒక్కొసారి కొందరు అభిమానులు స్టేజ్ పైకి దూసుకువస్తుంటారు. ఈ క్రమంలో కొందరు హీరోలు సదరు అభిమానిని ఏమీ అనవద్దని బౌన్సర్లకు చెబుతూ అతడితో ఓ ఫోటో దిగడం ఇటీవల ఎక్కువగానే చూస్తున్నాం.
అయితే.. ఇదంతా ప్రీ ప్లానింగ్ అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం నిజంగానే అభిమానంతోనే స్టేజ్‌పైకి వెలుతుంటారు అని చెబుతుంటారు. ఈ సంగతి అటు ఉంచితే ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda )ప్రధాన పాత్రలో నటించిన బేబీ సినిమా సక్సెస్ మీట్‌లోనూ ఇలాంటి ఘటననే జరిగింది. ఈ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda ) మాట్లాడుతుండగా.. ఓ అభిమాని స్టేజీ పైకి ఎక్కి అతడి పాదాలను తాకేందుకు ప్రయత్నించాడు.
Vijay Deverakonda : నా ప్రేమ ఇట్లనే ఉంటుంది అంటూ వీడియో పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏంఉందంటే..? విజయ్ మాట్లాడుతుండగా ఓ అభిమాని సడెన్‌గా స్టేజీ పైకి దూసుకువస్తాడు. అది చూసిన విజయ్ దేవరకొండ అతడు తన పాదాలపై పడకుండా ఉండేందుకు వెంటనే పక్కకు పరుగెత్తాడు. ఇంతలో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది సదరు అభిమానిని పట్టుకుని వెళ్లిపోయారు.
#VijayDeverakonda ?❤️ pic.twitter.com/CFUzA0T1KW
— #sai!..? (@the_s_sai) July 18, 2023
ఇదిలా ఉంటే.. సమంతతో విజయ్ దేవరకొండ నటించిన ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తరువాత విజయ్.. జెర్సీ(Jersy) డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri) దర్శకత్వంలో VD12 చిత్రంలోనూ అదే విధంగా పరశురాం దర్శకత్వంలో VD13 సినిమాలోనూ నటిస్తున్నాడు.