Director Anil Ravipudi made interesting comments about the song in the Chiranjeevi-Venkatesh combo.
Chiranjeevi-Venkatesh: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడితో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. చిరంజీవిలోని వింటేజ్ కామెడీ టేమింగ్ ని మరోసారి ఆడియన్స్ ముందుకు ఈ సినిమాతో తీసుకువస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుంది అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
Shyamali De: తెగించిన వాళ్ళు ఇలానే చేస్తారు.. సమంతతో పెళ్లిపై రాజ్ మాజీ భార్య షాకింగ్ పోస్ట్
అయితే, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా చిన్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయంపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, తాజాగా ఈ ఇద్దరితో అదిరిపోయే సాంగ్ ని తెరకెక్కించాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ విషయాన్ని అనిల్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ మీడియా సంస్థతో అనిల్ మాట్లాడుతూ.. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి గారు వింటేజ్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. అది ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. విక్టరీ వెంకటేష్ గారు కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఆయన పాత్ర సినిమాలో 20 నిమిషాల పాటు ఉంటుంది.
చిరంజీవి-వెంకటేష్(Chiranjeevi-Venkatesh) మధ్య ఒక సాంగ్ కూడా ఉంటుంది. అది ఆడియన్స్ కి సర్ప్రైజ్ లా ఉంటుంది. ఇద్దరు డాన్స్ కుమ్మేశారు. సాంగ్ ఒక రేంజ్ లో వచ్చింది”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అనిల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ న్యూస్ తెలిసిన మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్-ఎన్టీఆర్ నాటు నాటు పాట ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అదే రేంజ్ లో ఈ పాట కూడా ట్రెండ్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, ఇన్ని స్పెషాలిటీస్ తో వస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అని ఫిక్స్ అవుతున్నారు. ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి ప్రేక్షలకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.