Director Anil Ravipudi next film with producer Dil Raju.
Anil Ravipudi: మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు అనిల్ రావిపూడి. మిగతా దర్శకుల లాగా కమర్షియల్ కథలతో గేమ్ ఆండకుండా పక్కా ఫ్యామిలీ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నాడు. అసలు ఒక సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి.
పాన్ ఇండియా మోజులో పడి వందలకు వందల కోట్లు పెట్టి సినిమాలు చేస్తూ డిజాస్టర్స్ అవుతున్న ఈ రోజుల్లో జస్ట్ చిన్న పాయింట్ తీసుకొని అది ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేసి, కాస్త కామెడి మిక్స్ చేసి అద్భుతమైన విజయాలు అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ఒకప్పుడు అయన సినిమాలు క్రింజ్ అన్నవాళ్ళే ఇప్పుడు ఎగబడి మరీ ఆయన సినిమాలు చూస్తున్నాడు.
Sravanthi Chokkarapu: పండుగ పూట పట్టుచీరలో.. బుట్టబొమ్మ స్రవంతి ఫోటోలు
మన శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా అదే ప్రూవ్ చేసింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే రూ.229 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని వండర్స్ క్రియేట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపధ్యంలోనే అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. తమ సంస్థల్లో సినిమాలు చేయాలంటూ నిర్మాతలు బ్లాంక్ చెక్కులు ఇస్తున్నారట.
కానీ, అనిల్ మాత్రం తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తునాడట. ఆయనకు వరుస ఆఫర్స్ ఇచ్చిన నిర్మాత దిల్ రాజుతోనే నెక్స్ట్ సినిమా చేస్తున్నాడట అనిల్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది అని టాక్. అయితే, ఈ సినిమాలో హీరో ఎవరు అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.