×
Ad

Anil Ravipudi: ఇద్దరు సిద్ధం.. మరి సినిమా ఎవరితోనో.. దిల్ రాజు కూడా వెయిటింగ్ అక్కడ!

మన శంకర వరప్రసాద్ గారు సినిమా తరువాత ఇద్దరు నిర్మాతలకు కమిట్మెంట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi).

Director Anil Ravipudi next movie update

  • అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాపై ఆసక్తికర చర్చ
  • ఇద్దరు నిర్మాతలతో కమిట్మెంట్
  • దిల్ రాజుతో ఒక సినిమాకు ఒకే చెప్పిన అనిల్

Anil Ravipudi: మాస్, యాక్షన్ సినిమాలతో ఎవరైనా ఇండస్ట్రీ హిట్స్ కొడతారు. కానీ, ఫ్యామిలీ సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టేవాడికే ఒక రేంజ్ లో ఉంది. వాడే దర్శకుడు అనిల్ రావిపూడి. అసలు ఎం మంత్రం వేస్తున్నాడో తెలియడం లేదు కానీ. ప్రతీ సంక్రాంతికి వచ్చి సింపుల్ గా ఇండస్ట్రీ హిట్స్ కొట్టేసి వెళ్ళుపోతున్నాడు ఈ దర్శకుడు. ఆయన బలం ఫ్యామిలీ ఆడియన్స్.

కథలో పెద్దగా మలుపులు ఏముండవ్.. జస్ట్ రెగ్యులర్ కథకి కామెడీ, ఎమోషన్స్ ని యాడ్ చేసి హిట్ కొడతాడు అనిల్. రీసెంట్ గా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా విడుదలై 10 రోజులు గడుస్తున్నా థియేటర్స్ దగ్గర సందడి మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Esther Anil: దృశ్యం సినిమా పాప ఎలా మారిపోయిందో చూశారా.. ఫోటోలు

ఈ నేపధ్యంలోనే అనిల్ రావిపూడి(Anil Ravipudi) నెక్స్ట్ సినిమా గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈయనతో సినిమా చేసేందుకు ఇద్దరు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అందులో ఒకరు సాహు గారపాటి, మరొకరు వెంకట్ సతీష్ కిలారు. ఈ ఇద్దరితో సినిమాలు చేయాల్సిన కమిట్మెంట్ ఉంది అనిల్ రావిపూడికి. అయితే, ఈ ఇద్దరిలో ముందు ఎవరితో సినిమా చేస్తాడు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇప్పటికే ఈ ఇద్దరు నిర్మాతలు అనిల్ కోసం హీరోలను వెతికే పనిలో ఉన్నారు. ఎవరు ముందుగా హీరోని పెట్టేస్తే వారితోనే సినిమా సెట్ అన్నమాట. ఇక మరోపక్క దిల్ రాజు కూడా అనిల్ తో సినిమా చేసేందుకు సిద్ధం గా ఉన్నాడు. దిల్ రాజుతో అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సీక్వెల్ చేయాల్సి ఉంది. ఒకవేళ ఏది సెట్ కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ను మొదలుపెట్టే అవకాశం ఉంది అనిల్. మరి ఇన్ని ఆఫర్స్ మధ్య అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.