AS Ravi Kumar Chowdary : సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర‌ విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఏఎస్ రవికుమార్ చౌదరి హ‌ఠాన్మ‌ర‌ణం

సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది.

Director AS Ravi Kumar Chowdary passed away

సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర‌ విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఏఎస్ రవికుమార్ చౌదరి క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న మంగ‌ళ‌వారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

గోపిచంద్ హీరోగా ‘య‌జ్జం’ మూవీతో ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అయ్యారు ఏఎస్ ర‌వికుమార్‌. ఆ త‌రువాత బాల‌కృష్ణ‌తో ‘వీర‌భద్ర‌’, సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో ‘పిల్లా నువ్వులేని జీవితం’, గోపిచంద్‌తో ‘సౌఖ్యం’, నితిన్‌తో ‘ఆటాడిస్తా’ వంటి సినిమాలు తెర‌కెక్కించారు. చివ‌రిగా రాజ్‌త‌రుణ్‌తో ‘తిర‌గ‌బ‌డ‌రా సామి’ సినిమాని తీశారు.

kingdom : విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్‌డ‌మ్ మ‌ళ్ళీ వాయిదా? కార‌ణం ఇదే..?

కుటుంబానికి దూరంగా..
గ‌త కొన్నాళ్లుగా ఏఎస్ ర‌వికుమార్ కుటుంబానికి దూరంగా ఉంటున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న చేసిన చివ‌రి సినిమాలు ఆశించిన స్థాయిలో విజ‌యాల‌ను అందుకోలేక‌పోవ‌డంతో మాన‌సికంగా ఒత్తిడికి లోన‌య్యార‌ని అంటున్నారు.