Gunasekhar: దర్శకుడు గుణశేఖర్ కూతురి నిశ్చితార్థం..
ఒకప్పుడు భారీ సెట్లు వేసి, భారీ స్థాయిలో సినిమాలు తీస్తున్నారంటే.. అది కచ్చితంగా దర్శకుడు గుణశేఖర్ సినిమానే అయ్యి ఉండేది. ఇప్పటి వరకు సినిమాలు కోసం భారీ సెట్లు వేసిన గుణశేఖర్.. ఇప్పుడు అతని కూతురు కోసం సెట్టు వేసే సమయం వచ్చింది. గుణశేఖర్ కూతురు నీలిమ త్వరలో ఏడడుగులు వేయబోతుంది.
- gum 95921
- Published On : October 8, 2022 / 04:19 PM IST
Director Gunasekhar Daughter's Engagement
Gunasekhar: ఒకప్పుడు భారీ సెట్లు వేసి, భారీ స్థాయిలో సినిమాలు తీస్తున్నారంటే.. అది కచ్చితంగా దర్శకుడు గుణశేఖర్ సినిమానే అయ్యి ఉండేది. ‘చూడాలని ఉంది’ సినిమాలో కోలకత్తా సెట్టు, ‘ఒక్కడు’ సినిమాలో చార్మినార్ సెట్టు, ఇలా ప్రతి సినిమాని గ్రాండ్ గా ప్రెజెంట్ చేస్తూ ప్రేక్షకుల చేత “వావ్” అనిపించుకుంటూ వచ్చాడు గుణశేఖర్.
Samantha: “శాకుంతలం” మూవీ కొత్త పోస్టర్.. అదుర్స్!
ఇప్పటి వరకు సినిమాలు కోసం భారీ సెట్లు వేసిన గుణశేఖర్.. ఇప్పుడు అతని కూతురు కోసం సెట్టు వేసే సమయం వచ్చింది. గుణశేఖర్ కూతురు నీలిమ త్వరలో ఏడడుగులు వేయబోతుంది. నేడు(శనివారం) హైదరాబాద్ లో బంధుమిత్రులు మధ్య “రవి ప్రక్య”తో నీలిమ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
తన కాబోయే భర్తను పరిచయం చేస్తూ నీలిమ సోషల్ మీడియాలో ఒక ఫోటోను అప్లోడ్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. మోషన్ పిక్చర్లపై ఉన్న ఆసక్తితో నీలిమ తన తండ్రి అడుగుజాడలను అనుసరించి నిర్మాతగా మారింది. గుణశేఖర్ ‘రుద్రమదేవి’ సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన నీలిమ ఇప్పుడు ‘శాకుంతలం’ చిత్రాన్ని నిర్మిస్తోంది.
