×
Ad

Euphoria: సినిమా మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు.. నాపై కోపం కూడా వస్తుంది.. ప్రతీ ఒక్కరూ..!

యుఫోరియా(Euphoria) సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన దర్శకుడు గుణశేఖర్.

Director Gunasekhar interesting comments about the Euphoria movie.

  • గుణశేఖర్ ‘యుఫోరియా’ మూవీ ట్రైలర్ విడుదల
  • సామాజిక అంశాలతో వస్తున్న మూవీ
  • సినిమా ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అంటూ ఆసక్తికర కామెంట్స్

Euphoria: ఒక్కడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు దర్శకుడు గుణశేఖర్. కానీ, ఆ తరువాత ఆయనకు చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. చాలా కాలం తరువాత అనుష్కతో రుద్రమదేవి సినిమా చేసి డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత సమంత శాకుంతలం మూవీ చేసి డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తీసుకొని మరోసారి సోషల్ మూవీ చేస్తున్నాడు. అదే యుఫోరియా(Euphoria).

Mark OTT: ఓటీటీలో కిచ్చా సుదీప్ ‘మార్క్’.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?

సారా అర్జున్, భూమికా, గౌతమ్ మీనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా యుఫోరియా మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. నేటి యువత, వారిపై మాదకద్రవ్యాల ప్రభావం, మహిళలపై అఘాయిత్యాలు వంటి చాలా ఎలిమెంట్స్ ని ఈ ట్రైలర్ లో చూపించారు. ఆలాగే, నిజ జీవితంలో జరిగిన చాలా ఎలిమెంట్స్ ని ఈ సినిమాలో చూపించినట్టుగా అర్థమవుతోంది.

ఇక ఈ కార్యక్రమంలో దర్శకుడు గుణశేఖర్ సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ‘నా మనసుని బాగా కనెక్ట్ అయిన, కదిలించిన కథ ఇది. ఈ సినిమా చూసేటప్పుడు కొంతమంది మధ్యలోనే వెళ్లిపోవచ్చు, కొంతమందికి నాపై కోపం కూడా రావచ్చు. అంతలా ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేస్తుంది ఈ సినిమా. ప్రతి కుటుంబం ఈ పాయింట్ కి కనెక్ట్‌ అవుతుంది. ఇక కథ విన్నప్పుడే సారా అర్జున్‌ అయితే బాగుంటుందని నీలిమ చెప్పింది. ఆమె ఒప్పుకుంటేనే సినిమా చేద్దాం అని ఫిక్స్ అయ్యాం’ అంటూ చెప్పుకొచ్చాడు గుణశేఖర్. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.