‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై ప్రశంసలు కురిపించిన దర్శకేంద్రులు కె.రాఘవేంద్రరావు..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నేటితో రెండు వారలు పూర్తి చేసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా చాలా చోట్ల మంచి కలెక్షన్స్ రాబడుతుంది.
ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు పలువురు సినిమా ప్రముఖులు సైతం మంచి ప్రశంసలు అందజేయగా, తాజాగా టాలీవుడ్ దర్శక దిగ్గజం, దర్శకేంద్రులు కె. రాఘవేంద్ర రావు గారు ‘సరిలేరు నీకెవ్వరు’ పై ప్రశంసలు కురిపించడం జరిగింది.
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ దర్శకులైన అనిల్ రావిపూడితో కలిసి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రాఘవేంద్ర రావు మాట్లాడుతూ: ‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా, అన్ని అంశాల మిళితంగా సినిమాని తెరకెక్కించిన దర్శకుడు అనిల్ రావిపూడికి అలానే, తనలోని కామెడీ యాంగిల్‌ని మరొక్కసారి స్క్రీన్‌పై అదిరిపోయేలా ఆవిష్కరించి ఫ్యాన్స్‌ని, అలానే ఆడియన్స్‌ని అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినిమా సక్సెస్ అయిన సందర్భంగా టాలీవుడ్ దర్శక దిగ్గజం కె. రాఘవేంద్ర రావు గారు ‘సరిలేరు నీకెవ్వరు’ పై ప్రశంసలు కురిపిస్తూ అభినందనలు తెలిపారు. ఇక ప్రస్తుతం అనిల్, రాఘవేంద్ర రావు గారు కలిసి ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియో యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది..