Director Karthik Dandu comments on Sai Dharam Tej
Karthik Dandu : మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) తన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని, తనకు కూడా అభిమానులని ఏర్పరుచుకున్నారు. సాయిధరమ్ తేజ్ కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ కి గురయి చాలా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దాదాపు కొన్ని నెలలు బయటకు రాకుండా, హాస్పిటల్, ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. మొత్తం రికవర్ అయ్యాకే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు.
తేజ్ త్వరలో విరూపాక్ష సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో చిత్రయూనిట్ ఇటీవలే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా విరూపాక్ష క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనే ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో సినిమాలో నటించిన మెయిన్ క్యారెక్టర్స్ అందరిని పరిచయం చేశారు. ఈ ఈవెంట్ లో వాళ్లంతా సినిమాలో నటించిన గెటప్స్ వేసుకొని రావడం విశేషం.
ఈ ఈవెంట్ లో దర్శకుడు కార్తిక్ దండు మాట్లాడుతూ.. ఈ సినిమా కథను 2018లో రాశాను. రంగస్థలం షూటింగ్ సమయంలో సుకుమార్ గారికి ఈ కథను చెప్పాను. కరోనా వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ కరోనా గ్యాప్‌లో కథను ఎక్కడా మార్చలేదు. యాక్సిడెంట్ తరువాత తేజ్ గారిలో తెలియని ఓ భయం ఏర్పడింది. సెట్‌లో ఫస్ట్ రోజు తేజ్ గారు మాటలు సరిగ్గా రావడం లేదని భయపడేవారు. ఆయన మాట్లాడకపోవడంతో దాని ద్వారా వేరే వాళ్లకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అనే భయంలో ఉండేవారు. కానీ నాలుగో రోజు వచ్చి అదరగొట్టేశారు. టెక్నీషియన్స్ అందరికీ రుణపడి ఉంటాను. టీం అంతా కూడా ఎంజాయ్ చేస్తూ సినిమాను చేశాం. ఈ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశాము అని అని అన్నారు.
Virupaksha Characters Introduction Event : విరూపాక్ష క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఈవెంట్ గ్యాలరీ
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లోనే సాయిధరమ్ తేజ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాక్సిడెంట్ వల్ల నా మాట పడిపోయింది. చాలా కష్టంగా ఒక్కో పదం పలుకుతూ మళ్ళీ మాటలు నేర్చుకున్నాను. ఇంట్లో వాళ్ళు, మామయ్య అందరూ సపోర్ట్ గా నిలిచి ధైర్యం చెప్పారని చెప్పాడు.