×
Ad

Pawan Kalyan-Allu Arjun: పవన్-అల్లు అర్జున్ కాంబో సెట్.. భారీగా సెట్ చేసిన లోకేష్.. పండక్కి పండగలాంటి వార్త

మెగా ఫ్యాన్స్ కి, అల్లు ఫ్యాన్స్ (Pawan Kalyan-Allu Arjun)కి గుడ్ న్యూస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో భారీ మల్టీ స్టారర్ కి రంగం సిద్ధం అయ్యింది. అది కూడా అలాంటి, ఇలాంటి మల్టీ స్టారర్ కాదు.

Director Lokesh Kanagaraj planning massive multi-starrer movie with Pawan Kalyan and Allu Arjun.

Pawan Kalyan-Allu Arjun: మెగా ఫ్యాన్స్ కి, అల్లు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో భారీ మల్టీ స్టారర్ కి రంగం సిద్ధం అయ్యింది. అది కూడా అలాంటి, ఇలాంటి మల్టీ స్టారర్ కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రెజెంట్ ఉన్న ఇద్దరు టాప్ స్టార్స్ తో. ఆ స్టార్స్ మరెవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Pawan Kalyan-Allu Arjun). అవును, ఈ ఇద్దరు కలిసి ఒక భారీ సినిమా చేయబోతున్నారట. ఈ క్రేజీ కాంబోను డైరెక్ట్ చేసే ఛాన్స్ తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ కి దక్కిందట. నిజానికి గత కొంత కాలంగా లోకేష్ కానగరాజ్ తెలుగు డైరెక్ట్ సినిమా గురించి చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.

Bigg Boss 9 Telugu: పూర్తిగా మారిపోయిన వోటింగ్.. వార్ వన్ సైడ్.. విన్నర్ ఎవరో తెలిసిపోయింది..

ముందు రామ్ చరణ్ అని, ఆ తరువాత అల్లు అర్జున్ అని, ఆ తరువాత పవన్ కళ్యాణ్ అనే వార్తలు వినిపించాయి. ఒకానొక సమయంలో రామ్ చరణ్-అల్లు అర్జున్ కాంబోలో లోకేష్ సినిమా చేస్తున్నాడు అని కూడా వార్తలు వినిపించాయి. కానీ, ఫైనల్ గా పవన్-అల్లు అర్జున్ దగ్గర ఆగినట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా లోకేష్ కానగరాజ్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కి కథ కూడా వినిపించాడట. ఆ కథ ఇద్దరికి నచ్చడంతో వెంటనే ఒకే చేశారట. ఈ భారీ ప్రాజెక్టు ను తమిళా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మించనున్నట్టుగా సమాచారం

ఇటీవల కేవీఎన్ నిర్మాణ సంస్థ అధినేత లోహిత్ ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ని కలిసిన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించిన డేట్స్ కోసమే పవన్ ని కలిశాడట నిర్మాత. ఫైనల్ గా దర్శకుడు, కథ కూడా ఒకే అవడంతో నిర్మాత చాలా ఆనందంగా ఉన్నాడట. 2026 సంక్రాంతి కానుకగా అభిమానులకు పండుగలాంటి వార్తలు చెప్పనున్నారట మేకర్స్. ఇక ఈ న్యూస్ తెలియడంతో మెగా-అల్లు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్క ఉన్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.