×
Ad

Mega157 : చిరంజీవి కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఇక అడ్వెంచర్ షురూ..

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న Mega157 అప్డేట్ వచ్చేసింది.

  • Published On : September 10, 2023 / 05:00 PM IST

Director Mallidi Vasishta gave update on Chiranjeevi Mega157

Mega157 : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన 157వ సినిమాని ‘బింబిసార’ దర్శకుడు వశిష్టతో చేయబోతున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ నిర్మించబోతున్న ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందా..? అని ఆడియన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఒక ఆసక్తికర అప్డేట్ ని దర్శకుడు ఆడియన్స్ కి తెలియజేశాడు. చిరంజీవితో ఉన్న ఫోటో షేర్ చేస్తూ వశిష్ట ఒక ట్వీట్ చేశాడు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ని ఆకాశానికి ఎత్తేసిన బ్రెజిల్ ప్రెసిడెంట్..

“ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. ఇక అడ్వెంచర్ మొదలు పెట్టడానికి రెడీగా ఉన్నాము” అంటూ ట్వీట్ చేశాడు. కాగా వశిష్ట షేర్ చేసిన ఫొటోలో దర్శకనిర్మాతలతో పాటు సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కూడా కనిపిస్తున్నాడు. అంటే ఈ సినిమాకి డీఓపీగా చోటా కె నాయుడు భాద్యతలు తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరికొన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది.

Kollywood : తమిళ ఇండస్ట్రీని నమ్ముకొని క్లీన్ బౌల్డ్ అయిన స్టార్‌ క్రికెటర్లు..

కాగా ఈ మూవీ సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కబోతుందని తెలుస్తుంది. చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ లో ఆసక్తిని కలుగజేసింది. గతంలో ‘అంజి’ సినిమాతో సోషియో ఫాంటసీ నేపథ్యాన్ని టచ్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఆ జోనర్ లో మూవీ చేస్తున్నాడు. అంజి సినిమా బాగున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ కాలేకపోయింది. మరి ఈ Mega157 ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి. ఇక భోళా శంకర్ తో భారీ ప్లాప్ ని అందుకున్న చిరంజీవి నుంచి ఆడియన్స్ బ్లాక్ బస్టర్ కమ్‌బ్యాక్ ఆశిస్తున్నారు. ఈ చిత్రం ఆ ఆశని కూడా నెరవేరుస్తుందా..? లేదా..? చూడాలి.