SSMB29 : మహేష్ బాబు కోసం రంగంలోకి దిగిన జక్కన్న.. లొకేషన్స్ కోసం వేట షురూ..

Director Rajamouli started hunting locations for SSMB29

SSMB29 :టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన రాజమౌళి బాహుబలి, RRR వంటి పాన్ ఇండియా హిట్స్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాపైనే బిజీగా ఉన్నారు.

Also Read :NBK109 : ‘నన్ను క్షమించండి’.. NBK109 టైటిల్ అప్డేట్ పై నాగవంశీ షాకింగ్ కామెంట్స్..

మరోవైపు ssmb కోసం షూటింగ్ లొకేషన్ వేట మొదలు పెట్టాడు జక్కన్న. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఒక పోస్ట్‌ షేర్ చేశారు రాజమౌళి. అడవికి రారాజుగా పిలిచే సింహం ఫొటోని పెట్టి ‘క్రిస్ ఫాలోస్ తీసిన సెరెంగేటి రాజు ఫొటో ఇది. దీని పేరు BOB జూనియర్’’ అని పేర్కొన్నారు. దీంతో ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.


ఇక ఈ సినిమా అమెజాన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో అడ్వెంచరస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్‌బాబు సరికొత్త మేకోవర్‌తో రెడీ అవుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించనున్న ఈ చిత్రం కోసం విదేశీ సాంకేతిక నిపుణులు కూడా రంగంలోకి దింపుతున్నారట.