NBK109 : ‘నన్ను క్షమించండి’.. NBK109 టైటిల్ అప్డేట్ పై నాగవంశీ షాకింగ్ కామెంట్స్..

NBK109 : ‘నన్ను క్షమించండి’.. NBK109 టైటిల్ అప్డేట్ పై నాగవంశీ షాకింగ్ కామెంట్స్..

Naga Vamshi shocking update on NBK109

Updated On : October 30, 2024 / 3:13 PM IST

NBK109 : నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు అన్ స్టాపబుల్ షో కి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. NBK 109 వర్కింగ్ టైటిల్​తో ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చేస్తున్నారు.

దసరాకి ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారని ఎదురుచూసిన ఫాన్స్ కి నిరాశే మిగిలింది. మరి దీపావళికి అనౌన్స్ చేస్తారా అంటే అది కూడా లేదు. తాజాగా ఈ విషయం పై బాంబు పేల్చాడు నిర్మాత నాగవంశీ. తాజాగా లక్కీ భాస్కర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు.
“నిజానికి బాలయ్య NBK 109 సినిమా టైటిల్​ను పండగకు విజువల్స్​తో అనౌన్స్ చేద్దామని అనుకున్నాము.

Also Read : Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సావిత్రి కూతురు.. ఫొటోస్ వైరల్

కానీ మాకు సీజీ సమయానికి పూర్తవ్వలేదు. అందుకే ఇంకాస్త టైమ్ పడుతుంది. అభిమానులకు సారీ. టైటిల్​కు విజువల్​, బ్యాంగ్​తో ఇస్తేనే బాగా హైప్​ వస్తుందని బాబీ ఇంకా ప్రేత్యేకంగా చేస్తున్నారు. కానీ సీజే వర్క్​ టైమ్ వాళ్ళ లేట్ సవుతుంది. నవంబర్ రెండో వారంలో అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వారం లేదా పది రోజులు సీజీ కోసం టైమ్ కావాలని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.