Director Ram Gopal Varma shocking review about Dhurandhar movie.
Ram Gopal Varma: బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్ పై ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే, ఇండియన్ సినీ టాప్ సెలబ్రెటీలు అంతా ఈ చూసి ప్రశంసించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) చేరాడు. రీసెంట్ గా దురంధర్ సినిమా చూసిన ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన రివ్యూ ఇచ్చాడు. “చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమా దురంధర్. ఈ సినిమాను ఏ భాషలో తెరకెక్కించారు అనేదాని గురించి చెప్పడం లేదు. కానీ, ఇది భారతీయ సినిమా. ఈ సినిమాలో కనిపించే చిన్న దృశ్యమైనా ప్రేక్షకుడి మనసును హత్తుకుంటుంది. ఇలాంటి కథతో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంతో పాటు .. వారి మనసులు గెలుచుకోవడం అనేది మేకర్స్ సాధించిన గొప్ప విజయంగా చెప్పుకోవాలి.
Megastar Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్ లుక్స్ అదుర్స్.. బాస్ మాములుగా లేడుగా..
సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రతి సీన్ అలా గుర్తుండిపోతుంది. ఈ సినిమా చూసిన తరువాత మనసు ఏదో తెలియని భావోద్వేగంతో నిండిపోయింది. అది దర్శకుడు ఆదిత్య ధర్ గొప్పతనం’’ అంటూ రాసుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఇక రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ పోస్ట్ ఫై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘నేను కూడా ఒక సూట్కేస్ తో ముంబైలో అడుగుపెట్టాను. మీతో(రామ్ గోపాల్ వర్మ) పని చేస్తే చాలు అనుకున్నాను. అలాంటిది, ఇప్పుడు మీరు నా సినిమా చూసి ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానిగా ఈ పోస్టు చూసి నా హృదయం ఉప్పొంగిపోయింది”అంటూ రాసుకొచ్చాడు. దీంతో, ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక లాక్ డౌన్ టైం లో URI సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నది దర్శకుడు ఆదిత్య ధర్ దురంధర్ సినిమాను తెరకెక్కించాడు. ఇక దురంధర్ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు మేకర్స్. పార్ట్ 1 భారీ విజయం సాధించిన నేపధ్యంలో దురంధర్ 2పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదలై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.