RGV Tweets : పవన్‌కల్యాణ్‌గారూ.. భీమ్లానాయక్‌తో సబ్ కా బాప్ అని నిరూపించండి..!

అల్లు అర్జున్ గురించి వోడ్కా టైమ్ లో ట్వీట్ చేశాను ...ఇప్పుడు మీ గురించి కాఫీ టైమ్ లో ట్వీట్ చేస్తున్నానని గమనించాలంటూ సూచించారు. పిల్లలైన చరణ్, ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా సినిమాలు

Rgv And Varma

Ram Gopal Varma And Pawan Kalyan : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..ఎప్పుడూ వార్తలో ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తాజాగా చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఈసారి ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్స్ చేయడం గమనార్హం. టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న లెటెస్ట్ ఫిల్మ్ “భీమ్లా నాయక్” పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదా అని ప్రశ్నించారు. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాలాగా రిలీజ్ చేయాలని సూచించారు. పవన్ కళ్యాణ్ కు సూచనలతో చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More : Vehicle Crash in US : ఆరు వాహనాలు ఢీ..తొమ్మిది మంది మృతి

వర్మ ఏమన్నారంటే :-
సర్దార్ గబ్బర్ సింగ్ ను హిందీలో రిలీజ్ చెయ్యొద్దని.. ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూశారు… ఇప్పుడు మళ్లీ చెప్తున్నా.. భీమ్లా నాయక్ ను ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి.. పవన్ కల్యాణ్ మీ పాన్ ఇండియా పవర్ ఏంటో చూపించండి అంటూ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ గురించి వోడ్కా టైమ్ లో ట్వీట్ చేశాను …ఇప్పుడు మీ గురించి కాఫీ టైమ్ లో ట్వీట్ చేస్తున్నానని గమనించాలంటూ సూచించారు. పిల్లలైన చరణ్, ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారని, పుష్ప, కొమరం భీమ్, అల్లూరి సబ్జెక్ట్ పాన్ ఇండియా అయితే.. భీమ్లా నాయక్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా అంటూ క్వొశ్చెన్ వేశారు. మీరింకా తెలుగును పట్టుకుని వెళాడటం మా ఫ్యాన్స్ కు కన్నీటి ప్రాయంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. “బీమ్లా నాయక్”తో మీరే సబ్ కా బాప్ అని నిరూపించాలని,  పుష్పయే అంత చేస్తే, పవర్ స్టార్ అయిన మీరు భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలన్నారు. పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన… మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేమన్నారు. ‌ వైఫల్యం భయం వైఫల్యాన్ని నిర్ధారిస్తుందని తనదైన శైలిలో ఆర్జీవీ ట్వీట్ చేశారు.

Read More : Gannavaram Airport : గన్నవరం విమానాశ్రయంలో విమానాల చక్కర్లు, తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ మూవీకి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే రాస్తున్నారు. అందులో పవన్ పక్కన నిత్య మీనన్, రానాకి జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. పవన్ కళ్యాన్ ను స్ర్కీన్ పై ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ సినిమా రిలీజ్ పై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. కరోనా కారణంగా ఇప్పటికే పెద్ద సినిమాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు రావడంతో సినిమాలు రిలీజ్ చేసేందుకు ముందుకొస్తున్నారు. వాస్తవానికి సంక్రాంతికి భీమ్లా నాయక్ విడుదల కావాల్సి ఉంది. అయితే.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఇబ్బంది ఏర్పడింది. చివరకు భీమ్లా నాయక్ విడుదలను వాయిదా వేసుకున్నారు. ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఆ రోజు కూడా విడుదల చేస్తారా? లేదా ? అనే డౌట్స్ లో ఉన్నారు పవన్ ఫ్యాన్స్.