×
Ad

Mutton Soup : మటన్ సూప్ తో దర్శకుడిగా మారిన జర్నలిస్ట్.. త్వరలో ఓటీటీలోకి..

మటన్ సూప్ సినిమా ఇటీవల రిలీజయి సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ కథాంశంతో డిఫరెంట్ గా ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.(Mutton Soup)

Mutton Soup

Mutton Soup : అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ బ్యానర్స్ పై రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో మల్లిఖార్జున ఎలికా, అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘మటన్ సూప్’. రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.(Mutton Soup)

మటన్ సూప్ సినిమా ఇటీవల అక్టోబర్ 10న రిలీజయి మంచి విజయం సాధించింది. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ కథాంశంతో డిఫరెంట్ గా ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా మ‌ట‌న్ సూప్‌ ని తెరకెక్కించారు.

Also Read : Rashmika Mandanna : ప్రభాస్ సర్ ఈ మెసేజ్ చూడాలి.. రష్మిక ట్వీట్ వైరల్..

రియల్ గా జరిగిన పలు సంఘటనలను తీసుకొని ట్విస్టుల‌తో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తక్కువ బడ్జెట్ లోనే ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. త్వరలో ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ క్రమంలో మటన్ సూప్‌ డైరెక్టర్ రామ‌చంద్ర వ‌ట్టికూటి మ‌రో డిఫరెంట్ కంటెంట్‌తో తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు.