Rohit Shetty : అత్యధిక 100 కోట్ల సినిమాలు ఉన్న డైరెక్టర్ ఎవరో తెలుసా..

Director Rohit Shetty in 100 crore club movies

Rohit Shetty : ఏ సినిమా అయినా 100 కోట్ల క్లబ్ లోకి చేరడం అంటే అంత తేలికైన విషయం కాదు. కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో వచ్చినప్పటికీ 100 కోట్ల క్లబ్ లోకి చేరలేవు. కానీ కొన్ని సినిమాలు ఎటువంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో వచ్చి ఈ రేర్ ఫీట్ సాధిస్తాయి. అలా మొదటిసారి 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమా గజినీ. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 125 సినిమాలు ఈ ఫీట్ సాధించాయి.

అయితే ఈ 125 సినిమాల్లో 10 సినిమాలు ఒకే ఒక్క డైరెక్టర్ వి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు రోహిత్ శెట్టి. అలా ఏకంగా 10 సినిమాను 100 కోట్ల క్లబ్ లోకి చేరి కింగ్ అయ్యాడు రోహిత్. అంతే కాదు ఇండియన్ డైరెక్టర్స్ లోనే ఎక్కువ సినిమాలను 100 కోట్ల క్లబ్ లో చేర్చిన డైరెక్టర్ గా నిలిచాడు.

Also Read : Bigg Boss 8 : పృథ్వి కోసం మమ్మల్ని ఓడిస్తావా.. కావాలనే ఇదంతా చేస్తున్నావా.. విష్ణుపై హౌస్ మేట్స్ ఫైర్..

2010 లో గోల్ మాల్, 2011 లో సింగం, 2012లో బోల్ బచ్చన్, 2013లో చెన్నై ఎక్స్‌ప్రెస్, 2014 లో సింగం రిటర్న్స్, 2015లో దిల్‌వాలే, 2017లో గోల్ మాల్ ఎగైన్, 2018లో సింబా, 2021లో సూర్యవంశీ సినిమాలతో వరుసగా 100కోట్ల క్లబ్ లోకి చేరాడు. అయితే తన గత సినిమాతో ఈ క్లబ్ లోకి చేరలేకపోయిన రోహిత్ ఇటీవల విడుదలైన సింగం ఎగైన్ సినిమాతో మాత్రం ఈ ఫీట్ సాధించాడు. ఇక ఆయన చేసిన అన్ని సినిమాలు కలిపి దాదాపుగా 3000కోట్ల దాకా వాసులు చేసాయి.