Bigg Boss 8 : పృథ్వి కోసం మమ్మల్ని ఓడిస్తావా.. కావాలనే ఇదంతా చేస్తున్నావా.. విష్ణుపై హౌస్ మేట్స్ ఫైర్..

Bigg Boss 8 : పృథ్వి కోసం మమ్మల్ని ఓడిస్తావా.. కావాలనే ఇదంతా చేస్తున్నావా.. విష్ణుపై హౌస్ మేట్స్ ఫైర్..

Bigg Boss 8 House mates fire on Vishnu priya

Updated On : November 6, 2024 / 5:12 PM IST

Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 రోజు రోజుకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. బిగ్ బాస్ సరికొత్త గేమ్స్ తో షో ను మరింత ఇంట్రెస్టింగ్ గా మారుస్తున్నాడు. నేడు బాగ్ బాస్ కొత్త ప్రోమో విదుదల చేసారు నిర్వాహకులు. ప్రోమో లో ఎప్పటిలాగానే ఒక గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్. కంటెండర్ షిప్ టాస్క్ లో భాగంగా “కీ పట్టు కంటెండర్ షిప్ కొట్టు” అనే టాస్క్ ఇచ్చాడు.

Also Read : Vijay Deverakonda : దుల్కర్ బ్యూటీతో రౌడీ హీరో.. విజయ్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నాడా..

టాస్క్ లో పాల్గొనడానికి ముందు పృథ్వి, విష్ణు ప్రియ ఇద్దరు వచ్చారు. టాస్క్ లో భాగంగా ముందు తాళం వేసి ఉన్న మూడు పెద్ద బాక్స్ లను ఉంచుతారు. ఆ బాక్స్ తాళం చెవిలను మాత్రం వేరే దగ్గర దాస్తారు. ఒక్కో చోట ఒక్కో కీస్ పెడతారు. మొతటి కీస్ ఓ గోడలో, రెండవది కుండలో, మూడవది ఇసుకలో పెడతారు. అయితే టాస్క్ మొదట్లో విష్ణు బాగానే ఆడినప్పటికీ పృథ్వినే గెలుస్తాడు.

టాస్క్ అయిపోయిన తర్వాత రోహిణి, తేజ ఇద్దరూ విష్ణుతో మాట్లాడుతూ.. నువ్వు పృథ్వి కింద పడేసిన తాళం తీసుకొచ్చావా.. అందుకే మనం గేమ్ గెలవలేదు. కావాలనే ఇలా చేశావా. లేదా పృథ్వి గెలవాలని చేసావా అని అంటారు. ఒకవేళ ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే అలానే చేసేదానివా అని రోహిణి విష్ణుకి చెప్తుంది. అలా ప్రోమో ఎండ్ అవుతుంది. మరి విష్ణు ఇదంతా కావాలనే చేసిందా లేదా అన్నది తెలియాలంటే ఎపిసోడ్ చూడాలి.