Vijay Deverakonda : దుల్కర్ బ్యూటీతో రౌడీ హీరో.. విజయ్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నాడా..

Vijay Deverakonda going to do a special song with jasleen royal
Vijay Deverakonda : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పుడు విజయ్ VD12 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న విజయ్ ఈ సినిమాతో బాగానే ప్రయత్నిస్తున్నాడు.
Also Read : Kangana Ranaut : నేను అమెరికన్ అయితే.. అమెరికా ఎన్నికలపై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ మద్యకాలంలో సినిమాలు ఎలా అయితే రెస్పాన్స్ కనబరుస్తున్నాయో పలు ప్రైవేట్ సాంగ్స్ సైతం మంచి రెస్పాన్స్ తెచుకుంటున్నాయి. అలా సూపర్ డూపర్ హిట్ అయిన సాంగ్స్ లో ‘హీరియే’ సాంగ్ కూడా ఒకటి. ఇందులో దుల్కర్ సల్మాన్, జాస్లీన్ రాయల్ జంటగా నటించారు. కాగా ఈ ముద్దుగున్న ఈ పాటతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
#GuessWho
Big reveal in just a few hours! Are you ready!?? @dulQuer pic.twitter.com/9mwoayAq4r— Jasleen Royal (@jasleenroyal) November 6, 2024
అయితే తాజాగా ఇప్పుడు ఈ బ్యూటీతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ మ్యూజిక్ వీడియో చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. ఓ వైపు సినిమాలతో పాటు ఇప్పుడు మ్యూజిక్ వీడియో కూడా చేస్తున్నాడు విజయ్. ఇక ఇప్పటికే హీరియే’ సాంగ్ తో అదరగొట్టిన ఈమె ఇప్పుడు విజయ్ తో ఎలా నటిస్తుంది, సాంగ్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది.