Sagar Chandra : భీమ్లా నాయక్ అర్ధరాత్రి షూట్ చేస్తున్నప్పుడు.. ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి వస్తే పవన్ కళ్యాణ్ ఏం చేసారంటే..

ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర కూడా రాగా సినిమా గురించి మాట్లాడిన తర్వాత భీమ్లా నాయక్ షూట్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనని తెలిపారు.

Director Sagar K Chandra shares Interesting thing about pawan kalyan Bheemla Nayak Movie shoot

Sagar Chandra : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’(Operation Valentine) మార్చి 1న తెలుగు, హిందీ భాషలలో విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. తాజాగా నేడు హైదరాబాద్ JRC కన్వెన్షన్ లో ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రావడంతో అనేకమంది మెగా అభిమానులు వచ్చి సందడి చేశారు.

Also Read : Nagababu : వీరనారి శక్తి ఫౌండేషన్ కి ఆరు లక్షలు డొనేషన్ ఇచ్చిన నాగబాబు.. మిలటరీ వాళ్ళతో అనుబంధం..

ఈ ఈవెంట్ కి భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర కూడా రాగా సినిమా గురించి మాట్లాడిన తర్వాత భీమ్లా నాయక్ షూట్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనని తెలిపారు. సాగర్ చంద్ర మాట్లాడుతూ.. భీమ్లా నాయక్ అర్ధరాత్రి షూట్ చేస్తున్నప్పుడు ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి వచ్చారు. షూట్ హడావిడిలో అస్సలు పవన్ గారిని కలవడం కుదరదు. కానీ పవన్ గారికి ఇలా ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి వచ్చారని చెప్తే పిలిచి ఆయనతో కాఫీ తాగి, వాళ్ళకి ఫోటో ఇచ్చి పంపించారు. ఆర్మీ వాళ్ళని ఆలా గౌరవిస్తారు పవన్ గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక యూనిఫామ్ లేని సైనికుడే అని అన్నారు. దీంతో పవన్ అభిమానులు ఈ వ్యాఖ్యలని వైరల్ చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు