×
Ad

Sandeep Raj: నేను దురదృష్టవంతుడిని.. వెండితెర నన్ను అసహ్యించుకుంటుందేమో.. డైరెక్టర్ సందీప్ రాజ్ ఎమోషనల్ పోస్ట్..

కలర్ ఫోటో, మోగ్లీ సినిమాలకు నేను కాకుండా వేరే దర్శకుడు(Sandeep Raj) అయితే బాగుండేది. ఎందుకంటే, సినిమా కోసం ఏదైనా చేయగల మనుషులు ఈ సినిమాల కోసం వర్క్ చేశారు.

Director Sandeep Raj posts emotional post on Mowgli movie release

Sandeep Raj: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ’. యంగ్ హీరో రోషన్ కనకాల, సాక్షి మోడల్కర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో బండి సరోజ్, హర్ష కీ రోల్స్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన మోగ్లీ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది. దీంతో, టీం అంతా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అయితే, తాజాగా ఈ సినిమా విడుదల సమయంలోనే మరో భారీ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే డిసెంబర్ 12న దాదాపు 10 సినిమాను రిలీజ్ అవుతున్నాయి. వాటి పోటీ తట్టుకోవడమే కష్టం అనుకుంటే ఇప్పుడు మరో పెద్ద సినిమా కూడా అదే రోజున విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

JD Chakravarthy: ఇన్‌స్టాగ్రామ్‌లో జేడీ చక్రవర్తి ఎంట్రీ.. దేవుడు కాదు దేవుళ్ళు.. మొదటి పోస్ట్ తోనే షేక్ చేశాడుగా..

దీంతో చిన్న సినిమా మేకర్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నాడు. ఈ నేపధ్యంలోనే మోగ్లీ సినిమా దర్శకుడు సందీప్ రాజ్(Sandeep Raj) సోషల్ మీడియాలో ఎమోషనల్ చేశాడు. ఇది కేవలం తన బ్యాడ్ లక్ వల్లనే ఇలా జరుగుతుంది అంటూ రాసుకొచ్చాడు. బహుశా కలర్ ఫోటో, మోగ్లీ సినిమాలకు నేను కాకుండా వేరే దర్శకుడు అయితే బాగుండేది. ఎందుకంటే, సినిమా కోసం ఏదైనా చేయగల మనుషులు ఈ సినిమాల కోసం వర్క్ చేశారు. ఈ రెండు చిత్రాల మధ్య ఉమ్మడి అంశాల్లో ఒకటి, అంతా బాగానే జరుగుతున్నట్లు అనిపించి విడుదల విషయంలో పరిస్థితులు తారుమారు అవడం. దురదృష్టం ఎదురైంది. రెండవది నేనే. ఎందుకంటే, నేనే దురదృష్టవంతుడిని. “దర్శకత్వం: సందీప్ రాజ్” అనే టైటిల్‌ను తెరపై చూడాలనే నా కల. ఆ కల రోజురోజుకూ కష్టతరం అవుతోంది. బహుశా సిల్వర్‌స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందని అనిపిస్తోంది.

రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, DOP మారుతి, భైరవ లాంటి చాలా మంది అభిరుచి, చెమట, రక్తంతో మోగ్లీ సినిమా తెరకెక్కింది. కనీసం వారి కోసమైనా మోగ్లీకి మంచి జరగాలని ఆశిస్తున్నాను”అంటూ రాసుకొచ్చాడు సందీప్. దీంతో సందీప్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, సందీప్ చేసిన ఈ పోస్ట్ వల్ల సరికొత్త అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. పోటీ గట్టిగా ఉండటం వల్ల ఈ సినిమాను కూడా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయనున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.