×
Ad

Selvaraghavan: యుగానికి ఒక్కడు రీ రిలీజ్.. ఇప్పుడు సంబరాలు చేసుకొని ఎం లాభం.. అస్సలు సంతోషంగా లేను..

తమిళ స్టార్ కార్తీ హీరోగా వచ్చిన పీరియాడికల్ డ్రామా యుగానికి ఒక్కడు. దర్శకుడు (Selvaraghavan)శ్రీరాఘవ తెరకెక్కించిన ఈ సినిమా 2010లో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

Director Selvaraghavan makes shocking comments on the re-release of Yuganiki Okkadu

Selvaraghavan: తమిళ స్టార్ కార్తీ హీరోగా వచ్చిన పీరియాడికల్ డ్రామా యుగానికి ఒక్కడు. దర్శకుడు శ్రీరాఘవ తెరకెక్కించిన ఈ సినిమా 2010లో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ, ఈ సినిమా కోసం దర్శకుడు పడిన కష్టానికి మాత్రం ప్రశంసలు దక్కాయి. (Selvaraghavan)అయితే, ఇంతకాలం తరువాత ఇప్పుడు ఈ సినిమా మరోసారి తెరపైకి రానుంది. మార్చి 14న ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా యుగానికి ఒక్కడు సినిమా రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీరాఘవ మాట్లాడుతూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లో డబుల్ ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన పచ్చళ్ళ పాప.. శ్రీజ రీ ఎంట్రీ ఫిక్స్?

“యుగానికి ఒక్కడు సినిమా విడుదలైనప్పుడు చాలా నెగెటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. ఆ రివ్యూలు చూసి చాలా బాధేసింది. అప్పటినుంచే నెగెటివిటీని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. ఇంతకాలం తరువాత ఇప్పుడు ‘యుగానికి ఇక్కడ’ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి. ఈ సినిమా కోసం ఎంతో డబ్బు, సమయం వేచ్చించ్చాం. రిలీజ్ టైంలో ఇలా సంబరాలు చేసుకుంటే సంతోషపడేవాడిని” అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

ఇక యుగానికి ఒక్కడు 2 గురించి యాంకర్ ప్రశ్నించగా.. “అసలు యుగానికి ఒక్కడు 2 సినిమాను ప్రకటించకుండా ఉండాల్సింది. హీరోగా కార్తీ కాకుండా వేరెవరితో ఈ సినిమా చేయడం. చేయాలంటే కనీసం అతని సంవత్సర కాల్ షీట్స్ కావాలి. బడ్జెట్ కూడా చాలానే అవసరం అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో శ్రీరాఘవ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విరాళ వుతున్నాయి.