Director Shiva Nirvana gives clarity on Vijay Devarakonda Samantha Kiss Scene in Kushi Movie
Director Shiva Nirvana : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో వచ్చిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి(Kushi) సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజయి మంచి విజయం అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా మూడు రోజుల్లోనే 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 100 కోట్ల కలెక్షన్స్ కి దూసుకుపోతుంది. ఖుషి సక్సెస్ తో చిత్రయూనిట్ సక్సెస్ మీట్స్ కూడా నిర్వహిస్తుంది.
ఇక ఖుషి సినిమా ఫ్యామిలీ స్టోరీ అని చెప్తున్నా విజయ్, సమంత మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఒక పాటలోనే వీరిద్దరి మధ్య క్లోజ్ రొమాంటిక్ సీన్స్ పెట్టారు. విజయ్ సమంతలతో లిప్ కిస్ సీన్ కూడా పెట్టారు. ఇక వీరిద్దరూ కలిసి స్నానం చేస్తున్నట్టు సీన్స్ పెట్టారు. సినిమాలో కొంచెం రొమాంటిక్ కూడా ఎక్కువే ఉంది. అయితే దీనిపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సీన్స్ అన్ని పెట్టి ఫ్యామిలీ సినిమా అని, ప్యూర్ లవ్ సినిమా అని ఎలా చెప్తారు. ఒక్క రొమాంటిక్ సీన్ కూడా లేకుండా చాలా మంచి లవ్ సినిమాలు ఉన్నాయి అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల ఖుషి సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ లో పలువురు ఇదే అంశంపై డైరెక్టర్ శివ నిర్వాణని ప్రశ్నించగా దీనిపై శివ మాట్లాడుతూ.. అది సమంత గారు చేయలేదు, ఆరాధ్య అనే క్యారెక్టర్ చేసింది. ఆ క్యారెక్టర్ వన్ ఇయర్ ట్రావెల్ చేసింది అబ్బాయితో, పెళ్లి అయింది, పిల్లలు కావాలనే ఎమోషన్ ఉంది, అలాంటప్పుడు అలంటి చిన్న ముచ్చట కూడా ఉండదా, లేకపోతే అసలు అర్ధం ఉండదు. జనాలు నమ్మాలి కదా, కొంచెం రియల్ గా చూపించాలి కదా, వాళ్ళకి రియల్ గానే వైఫ్ అండ్ హస్బెండ్ గా యాక్ట్ చేస్తున్నారని ఫీలింగ్ రావాలి కదా. అందుకే ఆ సీన్స్ పెట్టాను. అది ఇలా సింపుల్ గా, పద్దతిగా ఉన్నంతవరకు ప్రాబ్లమ్ లేదు అని అన్నారు. అయితే పలువురు నెటిజన్లు భార్య భర్తల సినిమాలు, ఇంతకంటే ఎక్కువ ఎమోషన్ సినిమాలు రొమాంటిక్ సీన్స్, లిప్ కిస్ సీన్స్ లేనివి చాలా సినిమాలు ఉన్నాయి, మరి వాళ్ళు ఎలా తీశారు అని కామెంట్స్ చేస్తున్నారు.