Director Sundar C has started a new film with Rajinikanth as the hero and Kamal Haasan as the producer
Rajinikanth-Kamal Haasan: గత కొంతకాలంగా తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న కాంబో ఏదైనా ఉందంటే అది రజినీకాంత్-కమల్ హాసన్ కాంబో అనే చెప్పాలి. ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయబోతున్నారని, త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా రానుందని వార్తలు (Rajinikanth-Kamal Haasan)చెన్నై వర్గాల్లో వైరల్ అయ్యాయి. ఇక అప్పటినుంచి ఈ భారీ కాంబోలో వస్తున్న ప్రాజెక్టు కోసం ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో రజినీకాంత్ హీరోగా నటిస్తుండగా.. కమల్ హాసన్ కేవలం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Rashi Khanna: అలాంటి పాత్ర చేయడం చాలా కష్టం.. చాలా కామెంట్స్ చేశారు.. ఇదే సమాధానం అవుతుంది..
ఈ క్రేజీ ప్రాజెక్టును సీనియర్ దర్శకుడు సుందర్ సి తెరకెక్కించబోతున్నాడు. ఈ దర్శకుడు ఇప్పటికే రజినీకాంత్ తో అరుణాచలం అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ స్టామినాని ఆడియన్స్ కి మరోసారి రుచిచూపించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక కమల్ హాసన్ తో సుదర్ సి అన్బే శివమ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఇంతకాలానికి మరోసారి ఇద్దరు సూపర్ స్టార్స్ తో కలిపి ఒకేసారి సినిమా చేస్తున్నాడు దర్శకుడు సుందర్ సి. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ ముగ్గురూ కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 సినిమాలో నటిస్తున్నాడు. దర్శకుడు నెల్సన్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే సుదర్ సితో చేయబోయే సినిమా సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు రజినీకాంత్. ఇక ఈ సినిమా కూడా అరుణాచలం తరహాలోనే సరికొత్తగా ఉండనుందట. మరి చాలా గ్యాప్ తరువాత రజిని-కమల్ ఒక ప్రాజెక్టు కోసం పని చేయడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఇద్దరు ఒకే సినిమా చేస్తారని చూసిన ఫ్యాన్స్ మాత్రం కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.