‘నరసింహారెడ్డి‘ పాత్రకు చిరంజీవి గారిని తప్ప మరొకరిని ఊహించలేం – డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా రూపొందిన భారీ హిస్టారికల్‌ మూవీ ‘సైరా’ నరసింహారెడ్డి చిత్రం ఎలా స్టార్ అయ్యిందో వివరించిన దర్శకుడు సురేందర్ రెడ్డి..

  • Publish Date - October 2, 2019 / 07:23 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా రూపొందిన భారీ హిస్టారికల్‌ మూవీ ‘సైరా’ నరసింహారెడ్డి చిత్రం ఎలా స్టార్ అయ్యిందో వివరించిన దర్శకుడు సురేందర్ రెడ్డి..

‘అతనొక్కడే’, ‘కిక్‌’, ‘ఊసరవెల్లి’, ‘ధృవ’ లాంటి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌‌లతో ..సూపర్‌ హిట్‌ సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా రూపొందిన భారీ హిస్టారికల్‌ మూవీ ‘సైరా’ నరసింహారెడ్డి చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణ..లో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

‘బిగ్‌ బి’ అమితాబ్‌ బచ్చన్‌, ‘మక్కల్ సెల్వన్’ విజయ్‌ సేతుపతి, ‘కిచ్చా’ సుదీప్‌, నయనతార, తమన్నా, జగపతిబాబు, రవికిషన్‌, నిహారిక తదితరులు నటించారు. ఈ చిత్రం 150వ జయంతిగాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్‌ 2న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్‌ ఇండియా మూవీగా భారీ లెవల్లో విడుదలయింది. ఈ సందర్భంగా స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి ‘సైరా’ ఎలా స్టార్ అయ్యిందో చెప్పారు.

Read Also : సైరా – రివ్యూ..

‘చిరంజీవిగారితో సినిమా చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. ‘ధృవ’ సక్సెస్‌ టూర్‌ అమెరికాలో జరుగుతున్నప్పుడు ‘ధృవ’ చూశాను.. చాలా బాగుంది అని ఫస్ట్‌ మెసేజ్‌ చిరంజీవిగారి దగ్గరి నుండి వచ్చింది. ఆ రోజు సాయంత్రం చరణ్‌గారు ‘డాడీతో సినిమా చేద్దాం’ అన్నారు. ఆయన అలా అడగ్గానే చాలా సంతోషం కలిగింది. అమెరికా నుంచి రాగానే చిరంజీవిగారిని కలిశాను. ముందు ఓ స్టైలిష్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ చేయాలనుకొన్నాం. అప్పటికే చిరంజీవి గారి ‘ఖైదీ నెం 150’ రిలీజై పెద్ద హిట్‌ అయింది. అలా తరువాత బిగ్‌ మూవీ చేద్దాం అని మాట్లాడుకుంటున్న సమయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను చిరంజీవిగారు చెప్పడం జరిగింది. అప్పుడు నాకు కొంత టైం కావాలని చెప్పాను.

అప్పటికి నరసింహ రెడ్డి స్టోరీ విన్నాను కానీ పూర్తిగా తెలీదు. నేనే పరుచూరిగారి దగ్గరికి వెళ్లి కథ వినడం జరిగింది. తర్వాత నేను మెంటల్‌గా స్ట్రాంగ్‌ అవ్వడానికి ఆయన గురించి రీసర్చ్‌ మొదలుపెట్టాను. అప్పటినుంచి ఆరు నెలలు రీసెర్చ్‌ చేశాను. చెన్నై లైబ్రరీలకు వెళ్లి బ్రిటీష్‌ వాళ్లు విడుదల చేసిన గెజిట్స్‌ పరిశీలించాను. తంగిరాల సుబ్బారావుగారు రాసిన పుస్తకాలు చదివాను. అందులో కొన్ని పాయింట్స్‌ బాగా నచ్చడంతో ఒక నెలలో ఫుల్‌ బౌండెడ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేసుకొని పరుచూరి గారి దగ్గరకు వెళ్ళాను. ఆయనకూడా బాగుంది అనడంతో చిరంజీవిగారి దగ్గరకు వెళ్లి ఓకే సర్‌ నేను చేస్తాను అని చెప్పడం జరిగింది’.. అంటూ సైరా స్టార్ట్ అయిన విధానం గురించి చెప్పారు దర్శకులు సురేందర్ రెడ్డి..