Tharun Bhascker: రూ.5 కోట్ల చెక్ పక్కన పెట్టేసి.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న తరుణ్ భాస్కర్
ఈ నగరానికి ఏమైంది సినిమా తరువాత రూ.5 కోట్ల ఆఫర్ ని రిజెక్ట్ చేశాడట తరుణ్ భాస్కర్(Tharun Bhascker).
- V Santhosh Kumar
- Published On : February 9, 2026 / 11:29 AM IST
Director Tharun Bhascker rejected 5 crore offer.
- ENE తరువాత తరుణ్ భాస్కర్ కి భారీ ఆఫర్
- రూ.5 కోట్లు ఆఫర్ చేసిన నిర్మాత
- పక్కన పెట్టేసి వచ్చిన తరుణ్ భాస్కర్
Tharun Bhascker: ఎవరైనా దర్శకుడు తనకు రూ.5 కోట్ల ఆఫర్ వస్తే కాదనుకుంటారా? అది కూడా పెద్ద హీరోతో మంచి ఆఫర్. ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, దర్శకుడు తరుణ్ భాస్కర్ మాత్రం అలా చేయలేదు. తనకు ఏది నచుతుంది అదే చేశాడు. పెళ్లి చూపులు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ దర్శకుడు. ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అనే టైటిల్ తో అంతా కొత్తవాళ్లతో సినిమా చేశాడు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది.
Aamir Khan: ధురంధర్ వసూళ్లకు అదే కారణం.. చైనాలో అదే జరిగింది.. ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
అలా తనకు నచ్చిన, తన తరహా సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నాడు. ఈమధ్య నటుడిగా కూడా బిజీ అయ్యాడు తరుణ్ భాస్కర్(Tharun Bhascker). ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతి’. మలయాళ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. త్వరలోనే ఓటీటీలోకి కూడా రానుంది ఈ సినిమా. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన కెరీర్ లో వచ్చిన బిగ్గెస్ట్ ఆఫర్ గురించి చెప్పుకొచ్చాడు తరుణ్ భాస్కర్.
నేను పెళ్లి చూపులు తరువాత ఈ నగరానికి ఏమయ్యింది అనే సినిమా చేశాను. నా రెండు సినిమాలు చూసి ఒక నిర్మాత నాకు రూ.5 కోట్ల చెక్ రాసి ఇచ్చాడు. ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలనీ చెప్పాడు. ఎవరైనా ఆ టైం లో అంత పెద్ద ఆఫర్ వస్తే కాదనరు. కానీ, నేను మాత్రం ఆ ఆఫర్ వదులుకున్నాను. ఎందుకంటే, పెద్ద హీరోలతో సినిమా అంటే నా అభిరుచిని దాటి కథ చేయాల్సి ఉంటుంది. అది నేను చేయలేను. అందుకే ఆ ఆఫర్ ని పక్కన పెట్టేసి కీడా కోలా సినిమా చేశాను”అంటూ చెప్పుకొచ్చాడు తరుణ్ భాస్కర్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
