Aamir Khan: ధురంధర్ వసూళ్లకు అదే కారణం.. చైనాలో అదే జరిగింది.. ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
ధురంధర్ మూవీ కలెక్షన్స్ పై ఆమిర్ ఖాన్(Aamir Khan) షాకింగ్ కామెంట్స్ చేశారు.
Aamir Khan shocking comments about Dhurandhar movie collections.
- ఇండియాలో 9 వేల స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి
- ఎక్కువ స్క్రీన్స్ ఉంటె దురంధర్ కలెక్షన్స్ ఊహకు కూడా అందేవి కాదు
- ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు
Aamir Khan బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ధురంధర్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది. కేవలం హిందీ భాషలో విడుదలై ఈ సినిమా ఏకంగా రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్(Aamir Khan) చేరాడు.
Swayambhu Teaser: ‘స్వయంభు’ టీజర్ అప్డేట్ వచ్చేసింది.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరో నిఖిల్
ఈ హీరో ధురంధర్ సినిమా గురించి, ఆ సినిమా సాధించిన కలెక్షన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ధురంధర్ సినిమాకు లభించిన థియేటర్స్ కంటే ఎక్కవ థియేటర్లు అందుబాటులో ఉండి ఉంటే వసూళ్లు ఊహకు కూడా అందేవి కాదు. చైనా దేశంలో దాదాపు లక్ష స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, మన దేశంలో మాత్రం వాటి సమాఖ్య కేవలం 9 వేల లోపే ఉంది. ఇటీవల చైనాలో రిలీజైన ‘నె ఝా 2’ మూవీ ఏకంగా రూ.18వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
దానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న స్క్రీన్స్ సంఖ్యనే. ధురంధర్ సినిమా కేవలం 5 వేల స్క్రీన్లలో ప్రదర్శితమై రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అదే 15 వేల థియేటర్లలో రిలీజయ్యుంటే ఆ వసూళ్లు ఊహకు కూడా అందేవి కాదు”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో దురంధర్ సినిమాపై ఆమిర్ చేసిన కెమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ధురంధర్ 2 వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మార్చ్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
