Director Venky Atluri Comments on his Dhanush Sir Movie
Sir Movie : ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా సార్. తమిళ్ లో వాతిగా తెరకెక్కుతున్న సినిమా తెలుగులో సార్ గా రానుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ధనుష్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి తన గత మూడు సినిమాలు లవ్ స్టోరిలతోనే తెరకెక్కించాడు. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే.. మూడు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఈ సారి లవ్ స్టోరీ సినిమా నుంచి బయటకి వచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కథ రాశాడు. సార్ ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ సినిమా అని అర్థమైపోతుంది. చిత్ర యూనిట్ కూడా ఇదే చెప్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు.
తాజాగా వెంకీ అట్లూరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా బౌండరీలు పక్కన పెట్టి లవ్ స్టోరీ కాకుండా ఈ కథ రాశాను. నేను చదువుకున్నప్పుడు, అంతకు ముందు నుంచి కూడా ఇదే ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏమి మారలేదు. నేనైతే గత 20 ఏళ్ళుగా అదే ఎడ్యుకేషన్ సిస్టం చూస్తున్నాను. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పై ఫ్రస్టేషన్ వచ్చి ఈ కథ రాశాను. ఇలాంటి కథ ధనుష్ గారు ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం అని అన్నారు. దీంతో ఇండైరెక్ట్ గా ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పై కౌంటర్ వేశాడు డైరెక్టర్. మరి సినిమాలో ఇప్పటి ఎడ్యుకేషన్ సిస్టంపై ఇంకెన్ని కౌంటర్లు వేశాడో చూడాలి.