Kangana Ranaut : ‘క్వీన్’ సీక్వెల్ కథ రెడీ.. పట్టాలెక్కేదెప్పుడంటే..?

కంగనా రనౌత్ నటించిన 'క్వీన్' సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్ ఉంటే బాగుండునని అప్పట్లో అభిమానులు ఎదురుచూసారు. పదేళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్ చేస్తున్నట్లు డైరెక్టర్ వికాస్ బహ్ల్ వెల్లడించారు.

Kangana Ranaut

Kangana Ranaut : కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ మూవీ 2014 లో విడుదలైంది. వికాస్ బహ్ల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాగానే ఆడింది. సరిగ్గా పదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నట్లు వికాస్ బహ్ల్ వెల్లడించారు.

Gaami : విశ్వక్ ‘గామి’ నుంచి ‘గమ్యాన్నే చేధించే..’ సాంగ్ విడుదల.. ఈ మోటివేషనల్ సాంగ్ వినాల్సిందే..

కంగనా రనౌత్ నటించిన క్వీన్ సినిమా మంచి క్లాసికల్ మూవీ. బాలీవుడ్ మూవీలలో మంచి కథతో వచ్చిన సినిమాలలో ఒకటిగా చెప్పవచ్చును. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా సీక్వెల్ వస్తే బాగుండునని అభిమానులు ఆశించారు. ఫైనల్లీ ‘క్వీన్ 2’ కథ రెడీ అయ్యిందంటూ డైరెక్టర్ వికాస్ బహ్ల్ ప్రకటించారు.  కేవలం డబ్బు కోసం సినిమా తీయాల్సి వస్తే నాలుగేళ్ల క్రితమే క్వీన్ సీక్వెల్ తీసేవాడినని.. కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇంత టైమ్ పట్టిందని ఆయన చెప్పారు.

Vijay Deverakonda : ఫ్యాన్ గర్ల్ మూమెంట్.. విజయ్ దేవరకొండని చూడగానే ఫుల్ ఎగ్జైట్ అయిన దిల్‌రాజు కోడలు.. వీడియో వైరల్..

చివరి నిముషంలో అనూహ్యంగా వివాహం రద్దై ఒంటరిగా హనీమూన్ బయలుదేరి వెళ్లిన రాణి పాత్రలో కంగనా రనౌత్ ఎంతో బాగా నటించారు. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. 62వ జాతీయ చలచ చిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటిగా కంగనా అవార్డులు అందుకున్నారు. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా అలరిస్తుందని అభిమానులు ఆశ పడుతున్నారు. కంగనా ప్రస్తుతం ఎమర్జెన్సీ, వికాస్ బహ్ల్ డైరెక్ట్ చేసిన ‘షైతాన్’ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు