The Suspect : ‘ది సస్పెక్ట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని డైరెక్టర్ VN ఆదిత్య రిలీజ్ చేసారు. అలాగే సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Director VN Aditya Release First Look Poster of The Suspect Movie and Release Date Announced

The Suspect : రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏకెన్ ప్రసాద్, మృణాల్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ‘ది సస్పెక్ట్’. టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ పై కిరణ్ కుమార్ నిర్మాణంలో రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని డైరెక్టర్ VN ఆదిత్య రిలీజ్ చేసారు. అలాగే సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Also See : యాంకర్ సుమతో కిరణ్ అబ్బవరం స్పెషల్ ఇంటర్వ్యూ.. ఫన్నీ, ఎమోషనల్ ప్రోమో చూసేయండి..

ది సస్పెక్ట్ సినిమా మార్చి 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. పోస్టర్ లాంచ్ అనంతరం విఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ది సస్పెక్ట్ సినిమా మంచి హిట్ కొడుతుంది అని అన్నారు.

క్రైమ్ థ్రిల్లర్లో విభిన్న కోణంలో ప్రత్యేక పరిశోధన బృందం ఒక క్రైమ్ ని ఎలా కనుక్కున్నారు అనే కథాంశంతో డైరెక్టర్ ఈ ది సస్పెక్ట్ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా SKML మోషన్ పిక్చర్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మార్చి 21న విడుదల చేయనున్నారు.