థమన్ మ్యూజికల్ డ్రామాతో డిస్కో రాజా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. సోషల్ మీడియాలో డిస్కో రాజా హాష్ ట్యాగ్‌తో టీజర్ అప్‌డేట్ గురించి వైరల్ అయింది. దీనిపై క్లారిటీ ఇస్తూ ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్స్ ఓ అప్‌డేట్ ఇచ్చింది. జనవరి 18న జరగనున్న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
మాస్ మహారాజా.. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ డైరక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘డిస్కోరాజా’. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఫైట్ మాస్టర్ వెంకట్ నేతృత్వంలో ఫైటింగ్ సీన్స్‌ను తెరకెక్కించబోతున్నారు.
విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కలిపి యాక్షన్ థ్రిల్లర్‌గా, అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సిద్ధం చేస్తున్నారు. వెన్నెల కిషోర్ మెయిన్ కమెడియన్‌గా అలరించనున్నారు. సంగీతం: తమన్, మాటలు: అబ్బూరి రవి, ఫొటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని.
The Grand PreRelease event of #DiscoRaja? will be held on 18.01.2020. More details soon..#DiscoRajaPreReleaseOnJan18th#DiscoRajaMonth #DiscoRajaOnJan24th@RaviTeja_offl @NabhaNatesh @starlingpayal @Tanyahopeoffl @actorsimha @MusicThaman @Dir_Vi_Anand @itsRamTalluri @SRTmovies pic.twitter.com/KjW8kughVF
— SRT Entertainments (@SRTmovies) January 4, 2020