దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య ఘటనను తెరకెక్కించబోతున్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మ… ఆ దిశగా ముమ్మర కసరత్తు చేస్తున్నారు. దిశ ఘటనపై పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికే నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యను కలిసిన ఆర్జీవీ… తాజాగా ఖాకీల వెర్షన్ తెలుసుకునేందుకు ప్రయత్నించారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వర్మ… అక్కడి ఏసీపీ అశోక్‌కుమార్‌తో భేటీ అయ్యారు. దిశ ఇన్సిడెంట్‌పై ఆయనతో చర్చలు జరిపారు.
త్వరలో ఎవరినీ కలుస్తానో చెబుతానన్నారు. రీసెర్చ్ జరుగుతోందని, ఏం చేయబోతున్నాననేది చెప్పలేనన్నారు. దిశ తల్లిదండ్రులకు ఏం సంబంధం లేదన్నారు. జాతీయ స్థాయిలో ఈ కేసు సంచలనం సృష్టించిందని, ఒక ఏమోషనల్ క్యాప్చర్ చేయాలన్నదే తన ప్రయత్నమని చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు ఆర్జీవీ. త్వరలో మరికొందరు పోలీస్ అధికారులను కూడా కలుస్తానన్న ఆయన… సమాచారన్నంతా క్రోడీకరించిన తర్వాత తాను సినిమాలో ఏం చూపించాలన్న దానిపై నిర్ణయానికి వస్తానన్నారు వర్మ.
దిశ హత్య కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక..రాంగోపాల్ వర్మను కలిసిన సంగతి తెలిసిందే. 16 ఏళ్ల వయస్సుల్లో చెన్నకేశవులును వివాహం చేసుకుంది. ఈమె ప్రస్తుతం గర్భిణీ. ఈ సందర్భంగా ఆర్జీవీ పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
* దిశ హత్యాచార నిందితులను పోలీసులు 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్ చేశారు.
* షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేశారు.
* నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు.
* 2019, నవంబర్ 27వ తేదీన దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేశారు.
* అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గర కాల్చివేశారు.
* ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులుగా గుర్తించారు.
* దిశ కేసులో నిందితులను గురువారం 2019, డిసెంబర్ 5వ తేదీన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
Read More>> ఆర్మీ కమాండ్ పోస్టులకు మహిళలు అర్హులే..శాశ్వత హోదా మంజూరు చేయాలి : సుప్రీం