#ViralPicOfTheWeek: దిశా పటానీ హాట్ బికినీ నుంచి ప్రియాంక చోప్రా సర్ ప్రైజ్ వరకూ

బీ టౌన్ సెలబ్రిటీలు అందాలతో మతిపోగొట్టేశారు. సోషల్ మీడియాలో ట్రెండీగా మారిన వారి ఫొటోలు వైరల్ ఆఫ్ ద వీక్‌గా మారాయి. అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ భూటాన్ ట్రిప్, నిక్ జోనస్‌కు ప్రియాంక చోప్రా ఇచ్చిన సర్‌ప్రైజ్, దిశా పటానీ బికినీ ఫొటో టాప్ 5లో నిలిచాయి. 

పింక్‌లో ఒదిగిపోయిన కత్రినా:
ఉదయ్‌పూర్‌లో జరిగిన వివాహానికి కత్రినాకైఫ్ హాజరైంది. పింక్ కలర్ లెహంగాలో పింక్ చోలీతో పాటు ధరించి మొత్తం పార్టీలోనే జోష్ నింపింది. 

 

చేప వన్నెలతో మలైకా అరోరా:
రీసెంట్‌గా జరిగిన ఫొటో షూట్‌లో మలైకా అరోరా అద్భుతహ అనిపించింది. ఫుల్ ఫిట్‌నెస్‌తో కనిపించే బ్యూటీ.. క్రిస్టల్స్ పొదిగిన ఫ్యాషన్ గౌన్‌తో అదరగొట్టింది. లూజ్ హెయిర్‌తో ఫొటో షూట్ చేసి జీనియస్ లుక్‌లో మెరిసింది. 

 

కోహ్లీ-అనుష్కల హాలిడే:
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల భూటాన్ ట్రిప్ టాప్ 3స్థానాన్ని దక్కించుకుంది. రీసెంట్‌గా కోహ్లీ త్రోబ్యాక్ ఫొటో అంటూ ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటో నెటిజన్ల మనసు దోచుకుంది. పర్వతం మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్న ఫొటోతో పాటు ‘జీవన ప్రయాణంలో కలిసి నడుస్తున్నాం. ఏమీ లేకపోయినా ప్రేమ ఉంది’ అని అనుష్క శర్మను ట్యాగ్ చేశాడు. 

 

గుండె దడ పెంచిన దిశా పటానీ:
దిశా పటానీ తన బిజీ షెడ్యూల్‌కు కాస్త విరామం ఇచ్చింది. థాయ్‌లాండ్‌కు హాలి డే ట్రిప్ వెళ్లిన ఈ బ్యూటీ బికినీలో ఇంటర్నెట్‌కు వేడి పుట్టించింది. పూల్ దగ్గర కూర్చొని బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో టోన్డ్ బాడీ కనిపించేలా ఫోజిచ్చింది. 

 

నిక్ జోనస్‌కు ప్రియాంక సర్‌ప్రైజ్:
అమెరికన్ కోడలు ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌ను గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసింది. తొలి మ్యారేజీ యానివర్సరే సందర్భంగా జర్మన్ షెప్‌యార్డ్‌ కుక్కను గిఫ్ట్ గా ఇచ్చి ఆ వీడీయోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. నిక్ నిద్రలేవగానే కుక్క అతని మీదకు ఎక్కుతూ ఉన్న వీడియోతో పాటు అప్పుడే సంవత్సరం అయిపోయిందని భర్తను విష్ చేసింది. 

ట్రెండింగ్ వార్తలు