Divvela Madhuri made sensational comments on Anasuya Bharadwaj
Divvela Madhuri: టాలీవుడ్ నటుడు శివాజీ తాజాగా చేసిన కామెంట్స్ ఎంతలా వివాదాస్పదం అయ్యాయి అనేది ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. హీరోయిన్స్ వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడుతూ.. స్త్రీలు నిండుగా బట్టలు వేసుకుంటేనే గౌరవం అని, పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల వాళ్ళ మర్యాదను వాళ్ళే తీసుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. అలాగే, సినిమా అనేది ప్రొఫెషన్ కాబట్టి అక్కడ ఒకే కానీ, కనీసం పబ్లిక్ ఫంక్షన్స్ కి, బయటకు వచ్చినప్పుడైనా కాస్త మంచి బట్టలు వేసుకొని రండి. లేదంటే అన్ని దరిద్రాలను మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే మధ్యలో రెండు అసభ్యకరమైన పదాలను కూడా వాడాడు.
దాంతో, శివాజీ చేసిన ఆ కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. ఆయన చేసిన ఈ కామెంట్స్ పై యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయి రెచ్చిపోయి కామెంట్స్ చేశారు. ఇది తమ బాడీ అని, తమకు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకునే స్వేచ్ఛ ఆడవారికి ఉందని, కావాలంటే మీరు బుద్ది తెచ్చుకోవాలంటూ ఒక రేంజ్ లో రెచ్చిపోయారు. ఈమేరకు సోషల్ మీడియాలో వీడియోలు కూడా విడుదల చేశారు. అలాగే, కొంతమంది ఇండస్ట్రీకి సంబందించిన వారు కూడా శివాజీ చేసిన కామెంట్స్ ని తప్పుబట్టారు. అయితే, ఇండస్ట్రీ సంగతి ఎలా ఉన్నా.. సామాన్యుల నుంచి మాత్రం శివాజీకి సపోర్ట్ లభిస్తోంది. శివాజీ చేసిన కామెంట్స్ తో తప్పు ఏముంది అంటూ ఆయనకు నెటిజన్స్ మద్దతు ఇస్తున్నారు.
తాజాగా ఈ లిస్టులో దివ్వెల మాధురి(Divvela Madhuri) చేరారు. ఆమె కూడా శివాజీకి సపోర్ట్ గా నిలిచారు. రీసెంట్ గా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..”నటుడు శివాజీ వాడిన పదాలు తప్పు.. కానీ, ఆయన ఉన్న ఉద్దేశం సరైనదే. దానికి అయన క్షమాపణలు కూడా చెప్పారు. కాబట్టి, ఆ విషయాన్ని వదిలేయాలి. కానీ, అనసూయ మాత్రం అనవసరంగా అతి చేస్తోంది. స్త్రీకి చీరకట్టులోనే అసలైన అందం ఉంటుంది. కానీ, నేటి తరం హీరోయిన్లు మితిమీరిన స్కిన్ షో చేస్తున్నారు. ఎవరి ఇష్టం వాళ్లది అనిపిస్తే వాళ్ళను బట్టలు విప్పుకుని తిరగమనండి. ఇంతకంటే, అనసూయ ఎక్కువగా గురించి మాట్లాడలేం” అంటూ సంచలన కామెంట్స్ చేసింది. దీంతో దివ్వెల మాదిరి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ కామెంట్స్ పై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.