×
Ad

Divyabharathi : సుధీర్ ఏదో హెల్ప్ చేస్తాడు అని కాదు.. పబ్లిక్ గా అవమానించారు.. డైరెక్టర్ తో ఇష్యూ పై హీరోయిన్ కామెంట్స్..

సుధీర్, డైరెక్టర్ లేకుండానే ఈ సినిమా టీజర్ ఈవెంట్ నిర్వహించారు. (Divyabharathi)

Divyabharathi

Divyabharathi : సుడిగాలి సుధీర్ GOAT అనే సినిమాతో త్వరలో రాబోతున్నాడు. ఈ సినిమాలో తమిళ హీరోయిన్ దివ్యభారతి నటిస్తుంది. ఆమెకు ఇదే మొదటి తెలుగు సినిమా. అయితే ఈ సినిమా మొదట్నుంచి వివాదాలతో సాగుతుంది. ఈ సినిమా దర్శకుడు హీరోయిన్ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం, సినిమాలో మధ్యలో వదిలేసి వెళ్లడం.. ఇలా పలు సమస్యలు సాగుతూ వచ్చాయి. ఎలాగోలా ఈ సినిమా పూర్తయింది.(Divyabharathi)

ఇటీవల కొన్ని రోజుల క్రితం ఈ సినిమా దర్శకుడు నరేష్ కుప్పిలి హీరోయిన్ పై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో దివ్యభారతి ఫైర్ అయింది. సుధీర్ పేరు కూడా తన ట్వీట్ లో దివ్యభారతి ప్రస్తావించడంతో ఆ వివాదం కాస్త పెద్దదయింది. నేడు ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుధీర్, డైరెక్టర్ లేకుండానే ఈ సినిమా టీజర్ ఈవెంట్ నిర్వహించారు.

Also Read : Divyabharathi : టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న తమిళ బ్యూటీ.. దివ్యభారతి ఫొటోలు..

Divyabharathi

ఈ ఈవెంట్లో దివ్యభారతి దర్శకుడు, సుధీర్ తో ఉన్న వివాదం గురించి మాట్లాడుతూ.. వాళ్ళు వర్క్ ప్లేస్ లో కూడా అలాగే ఉండేవాళ్ళు. వాళ్ళ యాటిట్యూడ్ వాళ్లకు ఉండేది. వర్క్ ప్లేస్ లో రెస్పెక్ట్ ఇవ్వాలని మనం అడుక్కోలేము కదా. ఎవరికి వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు అందుకే సైలెంట్ గా సినిమాలో నా వర్క్ ఫినిష్ చేశాను. ఒక రోజు షూట్ లో పబ్లిక్ గా ఈ అమ్మాయిని ఎంత అందంగా చూపిద్దాం అనుకున్నా అంత అందంగా లేదు అని డైరెక్టర్ అన్నారు. అది నీ అభిప్రాయం కావొచ్చు కానీ అందరి ముందు అలా ఎలా మాట్లాడతారు. నా గురించి కామెంట్స్ చేస్తూ డైరెక్టర్, అతని అసిస్టెంట్స్ నవ్వుతూ ఉండేవారు. నాకు కాన్ఫిడెన్స్ పోయింది.

ఆ తర్వాత సోషల్ మీడియాలో చిలక అని నెగిటివ్ గా ట్రీట్ చేసారు. నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. అందుకే దానికి స్పందిస్తూ పోస్ట్ పెట్టాను. కానీ అది అంత అటెన్షన్ వస్తుంది అనుకోలేదు. నన్ను ఇరిటేట్ చేయడానికి సుధీర్ గారు నెక్స్ట్ చేయబోయే సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉందని, చేయమని వేరే డైరెక్టర్ తో అడిగించారు. అలా అడిగించడం తప్పు కాదు కానీ ఒక సమస్య ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకుండా కావాలని నన్ను టార్గెట్ చేయడం తప్పు. సోషల్ మీడియాలో అలా మాట్లాడటం తప్పు. సుధీర్ గారు కూడా ఈ సినిమాలో పని చేసారు. ఇది సుధీర్ గారి సినిమా. అతని ఫ్రెండ్ ఇలా ట్విట్టర్లో ట్వీట్ చేస్తే స్పందించలేదు అందుకే సుధీర్ గారిని కూడా మెన్షన్ చేశాను అంతే కానీ ఆయనేదో హెల్ప్ చేస్తాడు అని కాదు. నాకు డైరెక్టర్, సుధీర్ తో పర్సనల్ సమస్యలు ఏమి లేవు అని తెలిపింది. దీంతో దివ్యభారతి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి సుధీర్ ఈ వివాదంపై ఏమైనా స్పందిస్తాడా చూడాలి.

 

Also Read : Sudigali Sudheer : సుధీర్ మంచోడు అనే సినిమా తీసాం.. అతని గురించి మాట్లాడి వేస్ట్.. ఆ సినిమా ఇష్యూ పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు..