Diwali Films (1)
Diwali Films: ఫిల్మ్ ఇండస్ట్రీలో దివాళీ హంగామా మొదలైంది. హీరోలంతా బాక్సాఫీస్ ను బద్దలుకొట్టే మతాబులు.. ఇండస్ట్రీని షేక్ చేసేందుకు థౌజెండ్ వాలా.. ఫైవ్ థౌజెండ్ వాలా లాంటి మూవీస్ తో రాబోతున్నారు. రికార్డుల మోత మోగించి రీసౌండ్ వచ్చేలా చేసేందుకు రెడీ అయ్యారు. ఈసారి దీపాల పండక్కి సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు కలిసికట్టుగా వస్తున్నారు. మరి బరిలో ఎవరెవరున్నారో చూసేద్దాం పదండి..
Shruti Haasan: సోకుల గాలమేస్తున్న చెన్నై చంద్రం శృతి!
భాష ఏదైనా.. బాషా రూటే వేరు. రజినీ వస్తున్నాడంటె బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఈసారి దివాళీకి సూపర్ స్టార్ పెద్దన్నగా పెద్దరికం చూపించబోతున్నాడు. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కిన పెద్దన్న.. పండగపూట ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తోంది. పక్కా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ రజినీకి సిస్టర్ గా నటించడం.. కోవిడ్ తర్వాత ఇదే తొలి పెద్ద హీరో సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి.
Good Luck Sakhi: కీర్తి సురేష్ ‘గుడ్‌లక్ సఖి’ డేట్ ఫిక్స్!
కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో ట్రెండ్ సెట్ చేశిన డైరెక్టర్ మారుతి.. ఈ దివాళీకి మంచిరోజులు వచ్చాయి మూవీతో రాబోతున్నాడు. చాలా రోజుల నుంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్ మెహరీన్.. ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకుంది. హీరో సంతోష్ శోభన్ కూడా తన సత్తాని ప్రూవ్ చేస్కోవాలనే కసితో ఉన్నాడు. నవంబర్ 4న మంచి రోజులు వచ్చాయి సినిమా రాబోతోంది.
Raja Vikramarka: కామిక్ టచ్‌తో యాక్షన్.. ‘రాజా విక్రమార్క’ ట్రైలర్!
ఇక ప్రతిసారీ దీపాల పండక్కి బాలివుడ్ లో సందడి చేశే ఖాన్ హీరోస్ ఈసారి సైలెంట్ అయ్యారు. ఈసారి దివాళీకి హిందీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశే బాధ్యతను అక్షయ్ కుమార్ తీసుకున్నాడు. ఎప్పటి నుంచో వాయిదాలు పడుతూ వస్తున్న సూర్యవంశీ మూవీ నవంబర్ 5న రాబోతోంది. అక్షయ్ తో పాటు రణ్ వీర్ సింగ్, అజయ్ దేవగణ్ లీడ్ రోల్స్ లో నటించడం.. రోహిత్ శెట్టి డైరెక్షన్ చేయడంతో.. సూర్యవంశీపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అటు హాలివుడ్ సూపర్ హీరోస్ మూవీ ఇటర్నల్స్ కూడా నవంబర్ ఐదునే వస్తోంది. మొత్తానికి ఈసారి దివాళీ.. ఆడియన్స్ కి మస్తు ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోంది.