Neha Shetty : డీజే టిల్లు రాధిక ప్రేమలో ఉందా? ప్రేమ గురించి గొప్పగా చెప్పిన నేహశెట్టి.. నేహాని ఇంప్రెస్ చేయాలంటే..?

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన రూల్స్ రంజన్ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా నేహశెట్టి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ప్రేమ గురించి మాట్లాడింది.

Neha Shetty : డీజే టిల్లు రాధిక ప్రేమలో ఉందా? ప్రేమ గురించి గొప్పగా చెప్పిన నేహశెట్టి.. నేహాని ఇంప్రెస్ చేయాలంటే..?

DJ Tillu fame Neha Shetty spoke about Love in Rules Ranjann Promotions Video goes Viral

Updated On : September 27, 2023 / 9:48 AM IST

Neha Shetty :  ప్రస్తుతం టాలీవుడ్(Tollywood) లో బిజీగా ఉన్న హీరోయిన్స్ లో నేహశెట్టి ఒకరు. కన్నడ(Kannada) భామ అయిన నేహశెట్టి ఓ కన్నడ సినిమా చేసిన తర్వాత తెలుగులో మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కాని డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయింది నేహశెట్టి. ఈ సినిమాలో రాధిక క్యారెక్టర్ తో బాగా పాపులర్ అయింది నేహా. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో మీడియం, చిన్న హీరోల పాలిట దేవత అయిపోయింది నేహా.

డీజే టిల్లు సినిమా తర్వాత ఇటీవల బెదురులంక 2012 సినిమాతో మళ్ళీ హిట్ కొట్టింది నేహా శెట్టి. త్వరలో కిరణ్ అబ్బవరంతో కలిసి రూల్స్ రంజన్(Rules Ranjann) సినిమాతో రాబోతుంది. ఆ తర్వాత విశ్వక్ తో కలిసి గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో రాబోతుంది. నేహశెట్టి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసి ఫాలోవర్స్ ని తెచ్చుకుంటుంది.

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన రూల్స్ రంజన్ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా నేహశెట్టి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ప్రేమ గురించి మాట్లాడింది. యాంకర్ మీరు ప్రేమలో ఉన్నారా, మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అని అడగగా.. అతన్నే చెప్పమంది. మీరు ప్రేమలో ఉండొచ్చు అని అంటే నవ్వుతూ సమాధానం చెప్పకుండా వదిలేసింది.

Also Read : Nayanthara Vignesh Shivan : మలేషియాలో పిల్లల ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన నయనతార.. స్పెషల్ ఫోటోలు.. ఎంత క్యూట్‌గా ఉన్నారో

అయితే మీ అనుభవాల నుంచి ప్రేమ గురించి చెప్పండి అంటే నేహా శెట్టి.. లవ్ లో రూల్స్ ఉండవు, కాని రూల్స్ పెట్టుకుంటాము ఫాలో అవ్వము. లవ్ అనేది ఒక మంచి ఫీలింగ్, ఎంతో హ్యాపినెస్, రూల్స్, హద్దులు లవ్ లో ఉండవు. లవ్ చాలా బాగుంటుంది అని తెలిపింది. దీంతో నేహా శెట్టి కచ్చితంగా లవ్ లో పడి ఉంటుందని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి అని అడగగా.. నన్ను ఇంప్రెస్ చేయడం చాలా కష్టం అని చెప్పింది. మరి ఈ రాధిక మనస్సులో ఉన్న ఆ టిల్లు ఎవరో?