Project K T-shirt : ‘ప్రాజెక్ట్ K’ టీ షర్ట్ కావాలా.. అయితే ఇలా చేయండి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సినిమా ప్రాజెక్ట్ K. నాగ్ అశ్విన్ (Nag Ahwin) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.
- Thota Vamshi Kumar
- Updated on- July 8, 2023 / 08:34 PM IST
Project K T-shirt
Project K : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సినిమా ప్రాజెక్ట్ K. నాగ్ అశ్విన్ (Nag Ahwin) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. దీపికా పదుకొనే(Deepika Padukone), అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), దిశా పఠాని(Disha Patani), కమల్ హాసన్(Kamal Haasan) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్లో అడుగుపెట్టనున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్ K నిలవనుంది. ఈ నెలలో జరిగే ఈ ఈవెంట్లోనే ఈ మూవీ అఫీషియల్ టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఇక సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్లు వస్తాయా అని అభిమానులు ఎదురుచూస్తుండగా సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది.
Yash : నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చిన యశ్.. భారీ యాక్షన్ బడ్జెట్ సినిమా కాదట!
ప్రాజెక్ట్ K అని రాసి ఉన్న టీషర్టును అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని సొంతం చేసుకోవాలంటే వేగంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. చిత్ర బృందం ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేస్తే ఓ కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ పసుపు రంగులో ఉంటే కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయాలి. మన పేరుతో పాటు ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ తరువాత మనకు కావాల్సిన సైజ్‌లో టీషర్ట్‌ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. అంతే చాలా సింపుల్‌గా మీరు టీషర్ట్‌ను సొంత చేసుకోవచ్చు.
4 నిమిషాల్లో ఖతం..
అయితే.. ఫస్ట్ బ్యాచ్‌కు సంబంధించిన టీ షర్టులు అన్ని నాలుగు నిమిషాల్లో అయిపోయినట్లు వెల్లడించింది. అయితే బాధపడాల్సిన అవసరం లేదని, మరికొన్నింటిని త్వరలోనే తీసుకువస్తామని చెప్పింది. అయితే.. ఎప్పుడు అనేది వెల్లడించలేదు.
VD13 : అమెరికాలో మొదలు కానున్న విజయ్ దేవరకొండ మూవీ.. లొకేషన్స్ ఫైనల్ అయ్యాయి..
