Rukmini Vasanth
Rukmini Vasanth : కన్నడ సినిమాలతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి సినిమాతో బాగా పాపులర్ అయింది. ఇటీవల కాంతార చాప్టర్ 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో యువరాణి పాత్రలో కనిపించి అందర్నీ మెప్పించింది. తన నటనతో, యాక్షన్ సీక్వెన్స్ లతో, అందంతో అలరించింది. ఇప్పుడు రుక్మిణి వసంత్ దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది.(Rukmini Vasanth)
దీంతో రుక్మిణి వసంత్ ఎవరు అని తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో తన తండ్రి గురించి తెలుసుకొని అంతా ఆశ్చర్యపోతున్నారు. రుక్మిణి వసంత్ తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. ఆయన ఆర్మీ ఆఫీసర్ గా జమ్మూ కాశ్మీర్, సిక్కిం, పఠాన్ కోట్, రాంచి, బెంగళూరు.. పలు ప్రాంతాలలో పనిచేసారు. 2007 జమ్మూకాశ్మీర్ లోని ఉరి వద్ద ఉగ్రవాదులు అటాక్ చేయగా వసంత్ వేణుగోపాల్, మరికొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళను ఎదుర్కొన్నారు. ఈ ఘర్షణలో కల్నల్ వసంత్ వేణుగోపాల్ ఉగ్రవాదులతో పోరాడి వీర మరణం పొందారు. ఈయన ఛాతిలో ఏడు బులెట్లు దిగాయి. ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం ఆర్మీ అధికారులకు ఇచ్చే హైయెస్ట్ మెడల్ అశోక చక్ర ఇచ్చి గౌరవించింది.
రుక్మిణి వసంత్ కి ఏడేళ్లు ఉన్నప్పుడే కల్నల్ వసంత్ వేణుగోపాల్ మరణించారు. ఇప్పటికి తండ్రి జన్మదినం, వర్ధంతి రోజున తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. రుక్మిణి వసంత్ తల్లి కూడా దేశ సేవలోనే నిమగ్నమైంది.
రుక్మిణి తల్లి సుభాషిణి. ఆమె భరతనాట్యం డ్యాన్సర్. కల్నల్ వసంత్ వేణుగోపాల్ చనిపోయాక తనలాగా సైన్యంలో భర్తను కోల్పోయిన మహిళలకు అండగా ఉండాలని వీర్ రత్న ఫౌండేషన్ స్థాపించింది. రుక్మిణి తల్లితండ్రులు ఇద్దరూ దేశం కోసం నిలబడ్డారు. రుక్మిణి ఇలా సినిమాల వైపు అడుగులు వేసి మంచి మంచి సినిమాలతో ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతుంది. ప్రస్తుతం రుక్మిణి ఎన్టీఆర్ నీల్ సినిమాతో పాటు యశ్ టాక్సిక్ సినిమాలో నటిస్తుంది.
Also Read : Mahesh Babu Krishna : తండ్రి కృష్ణ దర్శకత్వంలో మహేష్ బాబు ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా? ఏమేం సినిమాలు..