Allu Brothers : అల్లు బ్రదర్స్ మొత్తం ముగ్గురు కాదు నలుగురా..? అల్లు శిరీష్ ఏం చెప్పాడంటే.. ?

అందరికి ఈ ముగ్గురు అన్నదమ్ముల గురించి తెలుసు. అయితే నిజానికి అల్లు బ్రదర్స్ నలుగురు అంట.

Do You Know About Allu Brothers Four Members Allu Sirish Revealed Details Here

Allu Brothers : అల్లు రామలింగయ్యతో సినీ పరిశ్రమలో అల్లు ఫ్యామిలీ ఆరంభమైంది. అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్ గా ఎదిగారు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను నవ్వించారు. అనంతరం ఆయన తనయుడు అల్లు అరవింద్ నిర్మాతగా మొదలుపెట్టి టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా ఎదిగారు. ఇక అరవింద్ కి ముగ్గురు కొడుకులు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. పెద్దవాడు అల్లు వెంకటేష్(బాబీ), తర్వాత అల్లు అర్జున్(బన్నీ), తర్వాత అల్లు శిరీష్.

అందరికి ఈ ముగ్గురు అన్నదమ్ముల గురించి తెలుసు. అయితే నిజానికి అల్లు బ్రదర్స్ నలుగురు అంట. కాకపోతే ఒకరు చిన్నతనంలోనే మరణించారు. గతంలో అలీతో సరదాగా షోలో అల్లు శిరీష్ ఈ విషయాన్ని తెలిపాడు. అలీ.. నాన్న వచ్చినప్పుడు అడుగుదాం అనుకున్నాను కానీ ఆయన హర్ట్ అవుతారేమో అని అడగలేదు మీరు మొత్తం నలుగురు కదా అని అడిగారు.

Also Read : Srinidhi Shetty : మహా కుంభమేళాలో కేజీఎఫ్ హీరోయిన్.. గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకొని.. తండ్రితో కలిసి..

దీనికి అల్లు శిరీష్ సమాధానమిస్తూ.. ఫస్ట్ ముగ్గురు ఉండేవారు మా పెద్దన్నయ్య వెంకటేష్, మధ్యలో అన్న రాజేష్, ఆ తర్వాత మూడో వాడు అర్జున్. ఐదారేళ్ళ వయసు ఉన్నప్పుడు అన్న రాజేష్ చనిపోయాడు. యాక్సిడెంట్ లో చనిపోయారు. నేను అప్పటికి ఇంకా పుట్టలేదు. ఆయన చనిపోయాక మా అమ్మ ఇంకో పిల్లాడ్ని కనాలి అనుకోవడంతో అప్పుడు నేను పుట్టాను. యాక్చువల్లీ నలుగురు ఇప్పుడు ముగ్గురే అని క్లారిటీ ఇచ్చారు.

Also Read : Bandla Ganesh : పవన్, మహేష్ సినిమాలకు 100 కోట్ల నష్టం వచ్చినా పట్టించుకోలేదు.. నిర్మాత వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్..

దీంతో నిజానికి అల్లు బ్రదర్స్ నలుగురు అయినా చిన్నప్పుడే ఒకరు చనిపోయారు అని అల్లు శిరీష్ తెలిపారు. ఇక ముగ్గురు అన్నదమ్ములు బిజీగానే ఉన్నారు. అల్లు వెంకటేష్ నిర్మాతగా పలు సినిమాలు తెరకెక్కిస్తూనే, బిజినెస్ లు చూసుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ మన అందరికి తెలిసిందే. పుష్ప 2 సినిమాతో ఇటీవలే పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఇక అల్లు శిరీష్ చివరగా బడ్డీ అనే సినిమాతో రాగా ఆ సినిమా పరాజయం పాలైంది. నెక్స్ట్ సినిమాని ఇంకా ప్రకటించలేదు.